Begin typing your search above and press return to search.

GOAT - విజయ్ ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి?

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన GOAT మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 11:38 AM GMT
GOAT - విజయ్ ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి?
X

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన GOAT మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్ మరొక్క సినిమా మాత్రమే చేయనున్నాడు. తరువాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై విజయ్ ఫోకస్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ తో అర్ధమైంది. తెలుగులో కూడా GOAT మూవీ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి ఇంకా ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు తెలుగులో చెప్పుకోదగ్గ ప్రమోషన్స్ లేవు. గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాలకి తెలుగులో ఆదరణ లభిస్తోండటంతో GOAT మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

విజయ్ గత సినిమా లియోతో పోల్చుకుంటే GOAT మూవీపై చెప్పుకోదగ్గ బజ్ లేదు. తెలుగులో ఈ సినిమా కంటే ఎక్కువ బజ్ సుహాస్ జనక అయితే గనక మూవీపైన ఉండటం విశేషం. వెంకట్ ప్రభు అయితే ఈ సినిమాని తమిళ్ సర్కిల్లో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. తన గత సినిమాలతో కంపారిజన్ చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి కనీసం విజయ్ ఫ్యాన్స్ నుంచి కూడా GOAT సినిమాకి సరైన రెస్పాన్స్ రావడం లేదనే మాట వినిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో GOAT మూవీ లియో ఫస్ట్ డే కలెక్షన్స్ లో సగం అయిన మొదటి రోజు వసూళ్లు చేస్తుందా అనే సందేహం అందరిలో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కూడా పెద్దగా క్లిక్ కాలేదు. యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదంట.

ఏరియాల వారీగా కూడా ఈ మూవీ డిస్టిబ్యూషన్ ఇంకా పూర్తికాలేదంట. సినిమాకి చెప్పుకోదగ్గ కాంపిటేషన్ అయితే లేదు. అయిన ఎగ్జిబిటర్స్ నుంచి పెద్ద రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం. మూవీపైన పెద్దగా బజ్ లేకపోవడం వలనే సినిమాకి ఎగ్జిబిటర్స్ నుంచి స్పందన రావడం లేదనే ప్రచారం నడుస్తోంది. విజయ్ కెరియర్ లోనే అతి తక్కువ బజ్ ఉన్న చిత్రంతో GOAT మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.