Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ : ఇది అలాంటిలాంటి మాన్‌స్ట‌ర్ కాదు..

ర‌న్నింగ్ లో ఉన్న రైళ్ల‌ను న‌మిలేస్తోంది.. భ‌వంతుల్ని పిప్పి పిప్పి చేసేస్తోంది.. దొరికిన ప్ర‌తిదానిని బంతాడేస్తోంది.

By:  Tupaki Desk   |   4 Sep 2023 2:39 PM GMT
ట్రైల‌ర్ : ఇది అలాంటిలాంటి మాన్‌స్ట‌ర్ కాదు..
X

ర‌న్నింగ్ లో ఉన్న రైళ్ల‌ను న‌మిలేస్తోంది.. భ‌వంతుల్ని పిప్పి పిప్పి చేసేస్తోంది.. దొరికిన ప్ర‌తిదానిని బంతాడేస్తోంది. అది అడుగుపెడితే చాలు విధ్వంశ‌మే.. ఇంత‌కీ ఏమిటా వింత జీవి? క‌చ్ఛితంగా అది మాన‌వుని ఊహ‌కు అతీత‌మైనది.. క‌చ్ఛితంగా అది ప్ర‌మాద‌క‌ర గాడ్జిల్లా..

గాడ్జిల్లా ఫ్రాంఛైజీలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో మెజారిటీ చిత్రాలు భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. కొన్ని సినిమాలు పేల‌వ‌మైన స్క్రిప్టుతో తేలిపోయినా కానీ ప్ర‌ధాన‌మైన గాడ్జిల్లా సిరీస్ లో కొన్ని విజ‌య‌వంత‌మైన సినిమాలు ఉన్నాయి. ఇక గాడ్జిల్లా ఫ్రాంఛైజీల్ని ర‌న్ చేయ‌డంలో జ‌ప‌నీలు ప్ర‌సిద్ధి చెందారు. ఇప్పుడు జ‌ప‌నీలు మ‌రోసారి `గాడ్జిల్లా- మైన‌స్ వ‌న్` పేరుతో ఒక భారీ చిత్రాన్ని తెర‌కెక్కించి రిలీజ్ కి సిద్ధం చేసారు.

అతడు ముంచుకొచ్చే రాక్షసుడు అంటూ.. `గాడ్జిల్లా మైనస్ వన్` టీజర్ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ స్పెష‌లిస్ట్ తకాషి యమజాకి ఈ చిత్రానికి రచన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జపనీస్ భాషలో 33వ గాడ్జిల్లా చిత్రం. ఓవరాల్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌చ్చిన గాడ్జిల్లా సినిమాల‌ను ప‌రిశీలించాక ఇది 37వ గాడ్జిల్లా చిత్రంగా గుర్తించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది.

యుద్ధానంతర జపాన్‌లో ఊహించ‌ని కొత్త భీభత్సం ఊపిరాడ‌నివ్వ‌దు. ఇది గాడ్జిల్లా విధ్వంసం. మ‌నిషి ఊహించ‌లేని భారీ మాన్ స్ట‌ర్ ఎటాక్స్ తో విధ్వంసానికి గురైన న‌గ‌రం, ఆ న‌గ‌రంలో ప్రజలు మనుగడ సాగించారా? లేదా? అన్న‌ది తెర‌పై చూపించారు. టీజర్‌లో గాడ్జిల్లా పునరాగమనం, అది సృష్టించే వినాశనం గ‌గుర్పాటుకు గురి చేస్తోంది. అందులో నగరం వినాశనానికి సంబంధించిన దృశ్యం భ‌యాన‌కంగా ఉంది. జపాన్ అప్పటికే యుద్ధం వ‌ల్ల‌ చాలా నష్టపోయింది. ఇంత‌లోనే ఈ మాన్ స్ట‌ర్ విధ్వంసం పరిస్థితులను మరింత దిగజార్చుతుంది. `గాడ్జిల్లా మైనస్ వన్` క‌థాంశం.. రెండవ ప్రపంచ యుద్ధానంతర జపాన్ నేపథ్యంలో సాగుతుంది. గాడ్జిల్లా అంటే అతిభారీ జీవి. ఇప్పుడు అంత‌కుమించి అనేలా భీక‌ర ఆకారాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అది సృష్టిస్తున్న విధ్వంశాన్ని ఎంతో రియ‌లిస్టిక్ గా చూపించ‌డం ద‌ర్శ‌కుని ప‌నితనానికి నిద‌ర్శ‌నం. రైనోసుకే క‌మికి, మిన‌మి హ‌మ‌బే, యుకి య‌మ‌డ‌, మునెట‌క ఆవోకి ఇందులో తారాగ‌ణం. త‌కాషి య‌జ‌మాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ముఖ్యంగా భార‌త‌దేశంలోను భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.