Begin typing your search above and press return to search.

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఐకాన్ స్టార్.. ప్రత్యేక ఆహ్వానం

ఈ వేడుకలలో ప్రముఖుల సమక్షంలో బాలకృష్ణ గారి సినీ ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 5:46 AM GMT
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఐకాన్ స్టార్.. ప్రత్యేక ఆహ్వానం
X

నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో గ్రాండ్ వేడుకలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమం తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఎంతో ప్రాముఖ్యంగా ప్లాన్ చేయబడింది. ఈ వేడుకలలో ప్రముఖుల సమక్షంలో బాలకృష్ణ గారి సినీ ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతుకున్నారు.

ఈ వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖ సినీ తారలకు ఇదివరకే ఇన్విటేషన్స్ అందాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ ప్రముఖ తారలు హాజరుకానున్నారు. అలాగే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన శివకార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ కూడా రానున్నారు. బాలయ్యకు మంచి మిత్రుడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కు కూడా ఆహ్వానం అందింది.

ఇక రీసెంట్ గా జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఆహ్వానం అందించడం జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు ఈ ఆహ్వానాన్ని వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారికి అందజేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు సినీ పెద్దలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ గారి సినీ ప్రస్థానం, తెలుగు సినిమా లో వారి పాత్ర గురించి మాట్లాడారు. ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని, బాలకృష్ణ గారి విజన్ గురించి సానుకూలంగా స్పందించారు. అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారిని గౌరవించే తీరును, ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతను పలువురి ముందు చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ, అతని తోటి నటులు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు అందరూ కలిసి ఘనంగా సెలబ్రేట్ చేయనున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ గారి స్థానం ఎంతటి ప్రాముఖ్యత వహిస్తుందో ఈ వేడుకల ద్వారా మరొకసారి స్పష్టమవుతుంది.