Begin typing your search above and press return to search.

గోల్డెన్ స్పారో వీడియో సాంగ్ వ‌చ్చేసింది

ఈ మ‌ధ్య చిన్నా పెద్దా అంద‌రూ క‌లిసి స్టెప్పులేస్తున్న సాంగ్ గోల్డెన్ స్పారో.

By:  Tupaki Desk   |   7 March 2025 3:24 PM IST
గోల్డెన్ స్పారో వీడియో సాంగ్ వ‌చ్చేసింది
X

ఈ మ‌ధ్య చిన్నా పెద్దా అంద‌రూ క‌లిసి స్టెప్పులేస్తున్న సాంగ్ గోల్డెన్ స్పారో. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో తెగ ఫేమ‌స్ అయింది. రీసెంట్ గా త‌మిళంలో ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన నిల‌వుక్కు ఎన్ మేల్ ఎన్న‌డి కోబం సినిమాలోని సాంగ్ ఇది. లిరిక‌ల్ వీడియో రిలీజైన ద‌గ్గ‌ర్నుంచే ఈ సాంగ్ నెట్టింట మోత మోగిపోతుంది.

ప్రియా ప్ర‌కాష్ వారియర్, అనికా సురేంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ నిల‌వుక్కు ఎన్ మేల్ ఎన్న‌డి కోడం. ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో మామా మామా క‌మ్ అండ్ సింగు అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్ లో ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టించింది. గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 21న రిలీజైన ఈ సినిమా ఆడియ‌న్స్ ను బాగా అల‌రించింది.

ఇదే మూవీ తెలుగులో జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా పేరుతో రిలీజై ఇక్క‌డ కూడా మంచి హిట్ గా నిలిచింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ గోల్డెన్ స్పారో తమిళ, తెలుగు వెర్ష‌న్ ఫుల్ వీడియో సాంగ్స్‌ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌ను జీవీ ప్ర‌కాష్, సుబ్లాషిణి, ధ‌నుష్, ఆరివు పాడగా, ప్రియాంక తో క‌లిసి పాటూ జీవీ ప్ర‌కాష్ కూడా ఈ స్పెష‌ల్ సాంగ్ లో మెరిశాడు.

ఇక ధ‌నుష్ విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ఆయ‌న కుబేర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.