రష్మిక ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..!
యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
By: Tupaki Desk | 13 Feb 2025 11:59 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న గత ఏడాది 'పుష్ప 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా రేంజ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1900 కోట్లకు మించి వసూళ్లను రాబట్టింది. శ్రీవల్లి పాత్రతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్న అంతకు ముందు రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్ సినిమాలో నటించింది. యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. రేపు ఈమె నటించిన 'చావా' సినిమా విడుదల కాబోతుంది.
విక్కీ కౌశల్ హీరోగా రూపొందిన చావా సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో రష్మిక ఉంది. చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథతో చావా సినిమాను రూపొందించారు. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'చావా' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. చావా సినిమాతో పాటు 'థామా' టీజర్‌ను ప్రదర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా దినేశ్ విజన్ దర్శకత్వంలో రూపొందిన 'థామా' సినిమా భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీలో ఈమె నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. చావా సినిమాతో పాటు థామా సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. రష్మిక నటిస్తున్న సినిమా కావడంతో తెలుగులోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.
రష్మిక మందన్న తెలుగులో ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. గర్ల్ ఫ్రెండ్‌తో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ ఈమె నటిస్తోంది. రష్మిక నటించిన కుబేరా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో నటించిన కుబేరా సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రాబోయే ఏడాది కాలంలో రష్మిక నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. రష్మిక చావా సినిమాతో మరోసారి మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. చావా సినిమా కోసం వెళ్లిన రష్మిక ఫ్యాన్స్‌కి థామాతో మరో సర్‌ప్రైజ్ ఉండనుంది. ఇది కచ్చితంగా రష్మిక ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.