టాప్ -10 లో మూడు తెలుగు సినిమాలే!
ముఖ్యంగా టాలీవుడ్ కు మరింత కలిసొచ్చిన ఏడాదిగా చెప్పొచ్చు. 2024 గూగుల్ ట్రెండ్స్ లో అత్యధికంగా శోధిం చిన చిత్రాల్లో టాప్ -10 లో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.
By: Tupaki Desk | 11 Dec 2024 5:19 AM GMTకోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడానికి అంతా రెడీ అవుతున్నారు. మరి ఈ ఏడాది సినిమాల పరంగా ఎలాంటి రికార్డులు నమోదయ్యాయో? ఓసారి రీకాల్ చేసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. మునుపటి కంటే? ఈ ఏడాది మరిన్ని సక్సెస్ లు భారతీయ చిత్ర పరిశ్రమలో నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద మెరుగైన ఫలితాలు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అన్ని భాషలకు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది.
ముఖ్యంగా టాలీవుడ్ కు మరింత కలిసొచ్చిన ఏడాదిగా చెప్పొచ్చు. 2024 గూగుల్ ట్రెండ్స్ లో అత్యధికంగా శోధిం చిన చిత్రాల్లో టాప్ -10 లో మూడు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వాటిలో రెండు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు చెందినవి. ప్రభాస్ హీరోగా నటించిన `సలార్ సీజ్ ఫైర్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 700కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇక రెండవ చిత్రం `కల్కి 2898`. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూ ళ్లను రాబట్టింది. భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిన చిత్రమిది. ఇక మూడవ చిత్రం ప్రశాంత్ వర్మ తెరెక్కించిన `హనుమాన్`. తేజ సజ్జా హనుమంతుడి పాత్రలో నటించిన సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. 40 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
టాప్ -10 జాబితాలో కల్కి 2898 రెండవ స్థానంలో, హనుమాన్ ఐదవ స్థానంలో ఉండగా, తొమ్మిదవ స్థానంలో `సలార్` నిలిచింది. ఇక మొదటి స్థానాన్ని శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు నటించిన `స్త్రీ-2` కైవసం చేసుకుంది.
`12th ఫెయిల్` మూడవ స్థానంలో, `లాపతా లేడీస్` నాల్గవ స్థానంలో, `మహారాజ్` ఆవర స్థానంలో, ` మంజుమ్మెల్ బాయ్స్` ఏడవ స్థానంలో, `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` ఎనిమిదవ స్థానంలో, `ఆవేశం` పదవ స్థానంలో నిలిచాయి.