Begin typing your search above and press return to search.

గోపీచంద్ ని అంత న‌వ్వించారా సార్!

శ్రీనువైట్ల సినిమాలంటే హాస్యప్ర‌ధానంగా సాగుతాయ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో అన్నిర‌కాల మ‌సాలాలు ద‌ట్టించి మెప్పించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌

By:  Tupaki Desk   |   9 Oct 2024 9:30 PM GMT
గోపీచంద్ ని అంత న‌వ్వించారా సార్!
X

శ్రీనువైట్ల సినిమాలంటే హాస్యప్ర‌ధానంగా సాగుతాయ‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో అన్నిర‌కాల మ‌సాలాలు ద‌ట్టించి మెప్పించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. దూకుడు వ‌ర‌కూ ఎలాంటి ఇబ్బంది లేకుండా జ‌ర్నీ సాఫీగానే సాగిపోయింది. ఆ త‌ర్వాతే స‌మ‌స్య‌లు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. `ఆగ‌డు` నుంచి మొద‌లైన వైట్ల ప్లాప్ ల ప‌రంప‌ర `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` వ‌ర‌కూ కొన‌సాగింది.

అంత‌కు ముందు గొప్ప క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా నీరాజ‌నాలు అందుకున్న ద‌ర్శ‌కుడు అంటూ పొగిడ‌న నోళ్లే రొటీన్ సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు అంటూ విమ‌ర్శించాయి. తాజాగా గోపీచంద్ తో `విశ్వం` తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇది కూడా గోపీ మార్క్ యాక్ష‌న్ తో పాటు వైట్ల మార్క్ హాస్యంతో నిండిన సినిమా అని ముందే చెప్పేసారు. సినిమాపై టీమ్ అంతా చాలా కాన్పిడెంట్ గా ఉంది.

ఈసారి ఎలైగైనా హిట్ కొడతాం? అనే ధీమా శ్రీనువైట్ల మాటల్లో క‌నిపిస్తుంది. ప్రేక్ష‌కులు కూడా ఆయ‌న కామెడీ ఆస్వాదించి చాలా కాల‌మ‌వుతుంది. దీంతో మ‌ళ్లీ క‌డుపుబ్బా న‌వ్వించాల‌ని ఆడియ‌న్స్ అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈసినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా గోపీచ్ంద్ ఆన్ సెట్స్ అనుభ‌వాన్ని పంచుకున్నారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

` శ్రీనువైట్ల‌లో నేచుర‌ల్ గానే ఓ సెటైరిక‌ల్ కామెడీ ఉంటుంది. ఆయ‌న సినిమాలో ప్ర‌తీ పాత్ర రిజిస్ట‌ర్ అవుతుంది. ఈ విష‌యంలో ఆయ‌న‌తో ప్ర‌యాణం మొద‌లు పెట్టిన‌ప్పుడు బాగా అర్ద‌మైంది. షూటింగ్ మొద‌లైన కొత్త‌లో ఆయ‌న టైమింగ్ ప‌ట్టుకోవ‌డాని కొంచెం ఇబ్బంది ప‌డ్డాను. అల‌వాటైన త‌ర్వాత షూటింగ్ స‌మ‌యంలో చాలా న‌వ్వుకున్నాను. షూటింగ్ చేసేట‌ప్పుడు కొన్ని స‌న్నివేశాల స‌మ‌యంలో న‌వ్వు ఆపుకోలేక‌పోయేవాడిని. సీన్ లోకి వెళ్తే న‌వ్వొచ్చొది. కొన్ని సంద‌ర్భాల్లో నా కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని న‌టీన‌టుల‌కు సారీ కూడా చెప్పాను. స‌న్నివేశాలు అంత హిలేరియ‌స్ గా వ‌చ్చాయి.