ప్లాప్ కాంబినేషన్స్ గ్రేట్ కంబ్యాక్ అయ్యేలా!
అయినా గోపీచంద్ మరో ప్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అతడే పూరి జగన్నాధ్.
By: Tupaki Desk | 26 Dec 2024 12:30 PM GMTమ్యాచో స్టార్ గోపీచంద్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతుంది. దీంతో విజయం కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇటీవలే శ్రీనువైట్లతో 'విశ్వం' సినిమా చేసి రిలీజ్ చేసారు. కానీ ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. శ్రీను వైట్ల అప్పటికే అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. అదే సమయంలో గోపీచంద్ అవకాశం ఇవ్వడంతో 'విశ్వం' తెరకెక్కింది. ఇద్దరు ప్లాప్ ల్లో ఉండటంతో ఒకరికొకరు లిప్ట్ ఇచ్చుకునట్లు అయింది.
సక్సెస్ అయితే ఆ ఫేజ్ నుంచి బయట పడే అవకాశం ఉండేది. కానీ ఫలితం నిరాశపరిచింది. అయినా గోపీచంద్ మరో ప్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అతడే పూరి జగన్నాధ్. ఈయనకి కూడా 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత విజయం లేని సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన 'డబుల్ ఇస్మార్ట్' కూడా సరైన ఫలితం సాధించలేదు. దీంతో పూరి పనైపోయిందని విమర్శలతో పాటు అతడి కంబ్యాక్ కొత్త కాదు అనే వాదన ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో పూరి కంబ్యాక్ కోసం గోపీచంద్ ని హీరోగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ఏడాది ఓప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని సమాచారం. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయట. ఇద్దరు ప్లాప్ ల్లో ఉన్నారు. దీంతో మరోసారి ఇద్దరు ఒకరికొకరు లిప్ట్ ఇచ్చుకుంటున్నట్లు అవుతుంది. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో 'గోలీమార్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్పుడు పూరి మాంచి ఫాంల్ ఉన్నాడు.
ఆ సమయంలో చేసిన చిత్రమది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత మళ్లి కలిసి పనిచేయలేదు. మళ్లీ ఇంతకాలానికి ఇద్దర్నీ వైఫల్యం కలపింది. మరి ఇద్దరికీ ఈ సినిమా గొప్ప కంబ్యాక్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.