Begin typing your search above and press return to search.

సందీప్‌ వంగ, అట్లీ.. ఇప్పుడు గోపీచంద్‌ మలినేని

ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్ సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 3:30 PM GMT
సందీప్‌ వంగ, అట్లీ.. ఇప్పుడు గోపీచంద్‌ మలినేని
X

ఒకప్పుడు బాలీవుడ్‌లో సౌత్‌ దర్శకులను పట్టించుకునే వారు కాదు. సౌత్ నుంచి వచ్చిన సినిమాలను అక్కడి ప్రేక్షకులు కనీసం పరిగణలోకి తీసుకునే వారు కాదు. బాలీవుడ్ వర్గాల వారు సైతం సౌత్‌ సినిమాలను లో బడ్జెట్‌ సినిమాలు అన్నట్లుగా చూడటంతో పాటు టెక్నికల్‌గా తక్కువ అనే అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బాలీవుడ్‌ సినిమాలకు సైతం దక్కని రికార్డులను సౌత్‌ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు సాధిస్తున్నాయి. ఇటీవల పుష్ప 2 సినిమా సాధించిన వసూళ్ల గురించి, సాధిస్తున్న రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్ సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ ఇప్పటికే అట్లీతో జావాన్‌ సినిమాను చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సందీప్‌ రెడ్డి వంగ ఇటీవల రణబీర్‌ కపూర్‌ తో యానిమల్‌ తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌లో జెండా ఎగరేస్తూ వస్తున్నారు.

టాలీవుడ్‌కి చెందిన మరో దర్శకుడు బాలీవుడ్‌లో 'జాట్‌' సినిమాను చేశాడు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్‌ ప్రధాన పాత్రలో జాట్‌ సినిమా రూపొందింది. ఇటీవల విడుదల అయిన టీజర్‌కి హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సన్నీ డియోల్‌ను ఇలా కూడా చూపించవచ్చా అంటూ అక్కడి ఫిల్మ్‌ మేకర్స్ సైతం అవాక్కవుతున్నారు. భారీ యాక్షన్ సినిమాగా జాట్ ఉంటుందని టీజర్‌ ను చూస్తేనే క్లారిటీ వచ్చేసింది. సోషల్‌ మీడియాలో జాట్‌ గురించి సన్నీ డియోల్‌ ఎలివేషన్స్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

టాలీవుడ్‌లో దర్శకుడిగా గోపీచంద్‌ మలినేని ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. కానీ చాలా తక్కువ సినిమాలు చేయడంతో పాటు తక్కువ సక్సెస్‌లను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు జాట్‌తో సక్సెస్ కొడితే వరుసగా రెండు మూడు హిందీ సినిమాలకు అదీ బాలీవుడ్‌ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు రావచ్చు అనే టాక్‌ వినిపిస్తోంది. అట్లీ, సందీప్ రెడ్డి వంగలు ఎలా అయితే బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్‌ను దక్కించుకున్నారో అలాగే గోపీచంద్‌ మలినేని సైతం కచ్చితంగా ఓ స్టార్‌డం ను సొంతం చేసుకుని బాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌత్‌ కంటెంట్‌కి ప్రస్తుతం హిందీ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. కనుక గోపీచంద్‌ ఆదిశగా ట్రై చేస్తే అక్కడ సెటిల్‌ కావడం పక్కా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.