బాలీవుడ్ లో మలినేని రైట్ టైమ్ లో ల్యాండింగ్!
తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సన్ని డియోల్ తో 'జాట్' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Dec 2024 6:30 AM GMT'పుష్ప' ప్రాంచైజీ నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే అందులో మాస్ యాంగిల్ అన్నది హైలైట్ అవ్వడంతోనే అది సాధ్యమైంది. ది రూల్ మొదటి భాగాన్ని మించి రెండు భాగంలో పుష్పరాజ్ పాత్రని మరింత మాస్ కోణంలో తీర్చి దిద్దడంతో? అంచనాలు మించి సక్సెస్ అయింది. మొదటి భాగం లో స్టోరీ సహా ఇతర పాత్రల సహకారంతో సినిమా నడుస్తుంది. కానీ రెండవ భాగమంతా వన్ మ్యాన్ ఆర్మీగానే బన్నీ పాత్రతోనే సినిమా నడుస్తుంది.
అతడి పాత్రలో మాస్ కోణాన్ని నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టుకుని సుకుమార్ తెలివిగా ఎక్కించాడు. ఇంతవరకూ బాలీవుడ్ లో మాస్ కంటెంట్ ఆరేంజ్ లో ఏ డైరెక్టర్ చేయలేదు. పుష్ప- భారీ సక్సెస్ కి ప్రధానంగా కలిసొచ్చిన అంశం అదే. బాలీవుడ్ లో మాస్ అంటే? యాక్షన్ చూపిస్తారు తప్ప! పాత్రలో బలాన్ని..భావోద్వేగాన్ని అంతగా కనెక్ట్ చేయలేరు అనే విమర్శ ఉంది. ఓ సందర్భంలో బాలీవుడ్ దిగ్గజాలే మన కథల్లో బలం..ఎమోషన్ తగ్గుంతని పబ్లిక్ గానే పోస్టులు పెట్టారు.
'పుష్ప' రిలీజ్ చూసిన అనంతరం ఈ రకమైన విమర్శ సొంత ఇండస్ట్రీ నుంచి తెరపైకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సన్ని డియోల్ తో 'జాట్' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఇవన్నీ విశ్లేషించుకుని బాలీవుడ్ కి వెళ్తున్నాడా? లేదా? అన్నది తెలియదుగానీ మలినేని మాత్రం రైట్ టైమ్ లోనే బాలీవుడ్ లాంచ్ అవుతున్నాడు. కమర్శియల్ మాస్ చిత్రాలు చేయడంలో మలినేని స్పెషలిస్ట్.
టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు కమర్శియల్ సక్సెస్ లు అందించిన డైరెక్టర్ అతను. మాస్ కంటెంట్ ని బాగా డీల్ చేయగల డైరెక్టర్. ఇప్పుడిదే 'జాట్' విషయంలో గోపీచంద్ కి కలిసొచ్చే అంశం. అతడి సినిమాలన్నీ తెలుగు ఆడియన్స్ కి ఒకేలా ఉంటాయి. కొత్తగా అనిపించవు. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి కాబట్టి కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సన్ని డియోల్ ఎలాగూ యాక్షన్ స్టార్. 'గదర్-2' తో మంచి కంబ్యాక్ దొరికింది. సరిగ్గా ఇదే సమయంలో గోపీచంద్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకెళ్లడంలో కలిసొచ్చే అంశమని వినిపిస్తుంది.