Begin typing your search above and press return to search.

ఈసారికి ఆ హీరో 'ఘాజీ'తోనే ఉత్త‌మం!

మ్యాచో స్టార్ గోపీచంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. గ్యాప్ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఫ‌లితాలు మాత్రం ఆశించిన విధంగా రావ‌డం లేదు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 6:14 AM GMT
ఈసారికి ఆ హీరో ఘాజీతోనే ఉత్త‌మం!
X

మ్యాచో స్టార్ గోపీచంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. గ్యాప్ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఫ‌లితాలు మాత్రం ఆశించిన విధంగా రావ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే 'లౌక్యం' త‌ర్వాత రిలీజ్ అయిన చిత్రాల్లో కొన్ని యావ‌రేజ్ గా ఆడిన‌వే త‌ప్ప బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది లేదు. 'గౌత‌మ్ నంద‌', 'ఆర‌డుగుల బుల్లెట్', 'ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్' లాంటి సినిమాలు యావ‌రేజ్ గా ఆడాయి. మిగ‌తా చిత్రాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

ఇటీవ‌లే 'విశ్వం' సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ఫలితం నిరుత్సాహ ప‌రిచింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గోపీచంద్ ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే `ఘాజీ` ఫేం సంక‌ల్ప్ రెడ్డితో ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. అలాగే మాస్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు ద‌క్కించుకున్న సంప‌త్ నందితోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. గ‌తంతో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 'గౌత‌మ్ నంద‌', 'సిటీ మార్' లాంటి చిత్రాలొచ్చాయి.

ఇవి సోసోగా ఆడిన సినిమాలు. ఈ నేప‌థ్యంలో మూడ‌వ సారి జత క‌డ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో గోపీచంద్ ముందుగా ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌యోగానికి పిలుపునిస్తాడా? సేప్ జోన్ చిత్రానికి ఛాన్స్ ఇస్తాడా? అన్న‌ది చూడాలి. గోపీచంద్ అభిమానులైతే? సంక‌ల్ప్ రెడ్డితో ఓ చిత్రం చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ గోపీచంద్ వెండి తెర‌పై ప్ర‌యోగాలు చేసింది లేదు.

వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించింది లేదు. రొటీన్ మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. సంప‌త్ నంది నుంచి కొత్త కంటెంట్ ఆశించ‌డం అన్న‌ది క‌ష్టమే. ఇప్ప‌టి వ‌ర‌కూ అత‌డు తెర‌కెక్కించిన చిత్రాల‌న్నీ రోటీన్ కంటెట్ తో రిలీజ్ అయిన‌వే. ఇప్పుడు సినిమా ట్రెండ్ కూడా మారింది. కొత్త కంటెంట్ కి ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తున్నారు. 'ఘాజీ' త‌ర్వాత సంక‌ల్ప్ రెడ్డి 'అంత‌రిక్షం' తెర‌కెక్కించాడు. ఇది క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ కాలేదు కానీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస లందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో గోపీచంద్ ఈసారికి 'ఘాజీ'కి ఛాన్స్ ఇస్తేనే బాగుంటుంద‌న్న‌ది మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది. మ‌రి బంతి గోపీచంద్ కోర్టులోనే ఉంది. ఛాన్స్ ఎవ‌రికిస్తారో చూడాలి.