సక్సెస్ లేని మరో దర్శకుడితో గోపిచంద్
ఇప్పుడు గోపీచంద్ ముందుకు మరో ఆసక్తికరమైన కథ వచ్చింది. 'ఘాజీ' వంటి విభిన్న కథా చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి, గోపీచంద్‌ను కలిసి తన కొత్త కథను వినిపించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 Dec 2024 9:30 AM GMTమాస్ ఫాలోయింగ్ గట్టిగానే ఉన్నా కూడా గోపిచంద్ సరైన ట్రాక్ లో వెళ్లడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. అతని కటౌట్ కి మాస్ ఇమేజ్ కి ఈపాటికే వంద కోట్ల హీరో అవ్వాలి. కానీ గోపిచంద్ దురదృష్టం ఏమిటో గాని సరైన హిట్స్ పడడం లేదు. దానికి తోడు కమర్షియల్ ఫార్మాట్ లో ఎక్కువగా సినిమాలు చేయడం ఆడియెన్స్ కు కూడా నచ్చడం లేదు.
ఇక గోపీచంద్ ప్రస్తుతం తన కెరీర్‌లో కొత్త దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఆయన చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. 'భీమా'తో కొంత ఊరట పొందిన గోపీచంద్, 'విశ్వం'తో మళ్లీ ఒడిదొడుకులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గోపిచంద్ ట్రాక్ మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 'జిల్' డైరెక్టర్ రాధాకృష్ణతో ఓ సినిమా ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి రావడం లేదు.
ఇప్పుడు గోపీచంద్ ముందుకు మరో ఆసక్తికరమైన కథ వచ్చింది. 'ఘాజీ' వంటి విభిన్న కథా చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి, గోపీచంద్‌ను కలిసి తన కొత్త కథను వినిపించారని తెలుస్తోంది. గోపీచంద్‌కు ఆ కథ చాలా బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందట. సంకల్ప్ రెడ్డి గతంలో 'ఘాజీ'తో మంచి గుర్తింపు పొందినా వరుణ్ తేజ్ తో చేసిన 'అంతరిక్షం' డిజాస్టర్ అయ్యింది.
ఇక ఆ తరువాత 'ఐబీ-71' సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో అతను గత రెండేళ్ళ నుంచి ఖాళీగానే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా మంచి సక్సెస్ తో ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇప్పుడు సంకల్ప్ కూడా యువ దర్శకుడు గోపీచంద్ కోసం ఓ కొత్త కాన్సెప్ట్‌తో సిద్ధమయ్యారని సమాచారం. ఈ కథ నేషనల్ లెవెల్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ నిర్మించబోతున్నారు. 'విశ్వం' తరువాత గోపీచంద్ లైన్ లోకి రెండు కథలను అనుకున్నప్పటికి ఇప్పుడు సడన్ గా ట్రాక్ మారింది. ఇదే సమయంలో గోపీచంద్ తన కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంకల్ప్ రెడ్డికి కూడా ఇది ఒక కీలక ప్రాజెక్ట్‌గా మారింది. ఈ సినిమాతో తన జాతకాన్ని మార్చుకోవాలని సంకల్ప్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఒక అప్డేట్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.