Begin typing your search above and press return to search.

అప్పుడే ఓటీటీలోకి గోపీచంద్ ‘విశ్వం’

అందుకు తగ్గట్లుగానే గోపీచంద్ చిత్రాన్ని కేవలం 20 రోజుల లోపే అంటే దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 29 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారట.

By:  Tupaki Desk   |   17 Oct 2024 2:30 AM GMT
అప్పుడే ఓటీటీలోకి గోపీచంద్ ‘విశ్వం’
X

చాలా మంది తెలుగు హీరోలు సరైన హిట్లను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా కెరీర్‌ పరంగా నిరాశను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. ఈ హీరోకు భారీ హిట్ వచ్చి చాలా కాలమే అవుతోందన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం అస్సలు ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే గోపీచంద్ 'విశ్వం' మూవీని చేశాడు.

ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఆదిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేస్తూ వచ్చారు. అలా హైప్‌ను కంటిన్యూ చేసుకుంటూ గోపీచంద్ సినిమాను దసరా పండుగా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నారు.

డిఫరెంట్ కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన 'విశ్వం' సినిమాకు అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ చిత్రం విఫలం అవుతూనే ఉంది. ఫలితంగా గోపీచంద్ నటించిన ఈ సినిమాకు కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో లభించడం లేదు. తద్వారా ఈ క్రేజీ మూవీ బాక్సాఫీస్ ముందు నష్టాల దిశగా సాగుతోంది.

మొదట్లో సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఫన్ అండ్ యాక్షన్‌తో రూపొందిన 'విశ్వం' సినిమాకు అనుకున్న విధంగా రెస్పాన్స్ లభించకపోవడంతో ఈ మూవీని త్వరగానే ఓటీటీలోకి తీసుకు వస్తారని ప్రచారం జరుగుతోంది.

అందుకు తగ్గట్లుగానే గోపీచంద్ చిత్రాన్ని కేవలం 20 రోజుల లోపే అంటే దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 29 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. దీనిపై అమెజాన్ త్వరలోనే ప్రకటన చేయబోతుందని తెలుస్తోంది. ఇక, 'విశ్వం' సినిమాను చిత్రాలయ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై వేణు దోణెపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిచొట్ల సంయుక్తంగా నిర్మించారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా చేయగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, వీటీవీ గణేష్, ప్రకాష్ రాజ్, సునీల్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు.