Begin typing your search above and press return to search.

గోపిచంద్ విశ్వం.. ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే..

మాచో స్టార్ గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో మొదటి సారి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వం’.

By:  Tupaki Desk   |   11 Sep 2024 6:39 AM GMT
గోపిచంద్ విశ్వం.. ఫస్ట్ సాంగ్ ఎలా ఉందంటే..
X

మాచో స్టార్ గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో మొదటి సారి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వం’. ఇక ఈ సినిమా మొదటి పాట ‘మొరొక్కన్ మగువ’ విడుదలైంది. సినిమాలో యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని అంశాలు సమపాళ్లలో మేళవించి, ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్‌టైన్ చేసేలా తెరకెక్కించారని టీజర్ ద్వారా స్పష్టమైంది. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.


విశ్వం చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు వేను దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ‘మొరొక్కన్ మగువ’ ను రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, ఈ పాటను ప్రుధ్వి చంద్ర, సాహితి చాగంటి తమ గానం మరింత అందంగా ఆలపించారు.

రకేందు మౌళి రాసిన ఈ పాటలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ పదాలు కలగలిపి వినసొంపుగా ఉండేలా రాశారు. పాటకు అనుగుణంగా పరిణామాలు, మారే లయలు ఈ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ పాటలో గోపీచంద్, కవ్యా థాపర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.

ఈ ఇద్దరూ స్టైలిష్ లొకేషన్స్ లో గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో పాటను మరింత హైలైట్ చేశారు. పాటలో చూపించిన విజువల్స్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ‘మొరొక్కన్ మగువ’ పాట సినిమా ప్రమోషన్స్‌కు శుభారంభం అందించి, ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందించగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

శ్రీను వైట్లకు చెందిన పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన గోపి మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా, కిరణ్ మానే ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. మరి ఈసారి గోపిచంద్ ఏ స్థాయిలో ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి.