Begin typing your search above and press return to search.

గోపీచంద్, శ్రీనువైట్ల విశ్వం.. టీజర్ ఎలా ఉందంటే?

ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌ ను ఎఫెక్టివ్‌ గా బ్యాలెన్స్ చేసే శ్రీను వైట్ల మార్క్.. విశ్వం టీజర్ లో క్లియర్ గా కనిపించింది. ట్రైన్ సీన్ మూవీకి కీలకంగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 10:59 AM GMT
గోపీచంద్, శ్రీనువైట్ల విశ్వం.. టీజర్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం విశ్వం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌ పై డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ వేణు దోనెపూడి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాపై గోపీచంద్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ స్ట్రైక్.. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. స్టైలిష్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వం సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చెప్పనట్లుగా.. మంగళవారం సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. దాంతోపాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన మూవీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

ఇంతకీ సంబంధం అబ్బాయికా అమ్మాయికా అనే డైలాగ్ తో ఫన్నీ గా టీజర్ స్టార్ట్ అయింది. బంగినపళ్లి లాంటి పాపకు కలెక్టర్ లాంటి కుర్రాడిని నీవే వెతకాలి అని నరేష్ చెబుతారు. కనపడగానే నా మీద పడిపోవాలి.. నైట్ అంతా మెలకువగా ఉండాలని హీరోయిన్ అంటోంది. ఇంతలో హీరో ఎంట్రీ ఇచ్చి.. ఫాదర్ అంటే ఇష్టమని చెబుతాడు. ఆ తర్వాత నీ అబ్బా అనే మాటను అందరూ అంటుంటారు. అది నచ్చిన హీరో చితక్కొడుతుంటాడు.

ఆ తర్వాత ట్రైన్ సీన్ స్టార్ట్ అయింది. సీక్వెన్స్ అంతా ఫుల్ కామెడీగా ఉంది. స్టార్ కమెడియన్లు అంతా సందడి చేశారు. అప్పటి వరకు ఫన్నీగా సాగిన టీజర్.. సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. హీరో గోపీచంద్.. ఎవరో వెంటాడుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఫైట్ తో అదరగొట్టారు. చివర్లో వెన్నెల కిషోర్ సీన్ తో ముగిసింది. ఓవరాల్ గా టీజర్.. సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. కామెడీతో మెప్పిస్తోంది.

ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌ ను ఎఫెక్టివ్‌ గా బ్యాలెన్స్ చేసే శ్రీను వైట్ల మార్క్.. విశ్వం టీజర్ లో క్లియర్ గా కనిపించింది. ట్రైన్ సీన్ మూవీకి కీలకంగా తెలుస్తోంది. గోపీచంద్ అల్ట్రా స్టైలిష్‌ గా కనిపిస్తూ.. తమ కామెడీ టైమింగ్ తో అలరించారు. ఫైట్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. హీరోయిన్ కావ్య థాపర్ తన గ్లామర్ అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. నరేష్, వెన్నెల కిషోర్ తోపాటు ఇతరులు తమ నటనతో సినిమాకు ఎక్స్ ట్రా ఎసెట్ గా మారారు. మరి ఈ సినిమాతో అటు శ్రీనువైట్ల.. ఇటు గోపీచంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.