Begin typing your search above and press return to search.

గోపిచంద్ భీమా.. అదే ఆయుధం!

మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 6:58 AM GMT
గోపిచంద్ భీమా.. అదే ఆయుధం!
X

మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. అయితే చాలా కాలంగా అతనికి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే పడలేదు. అయినప్పటికీ గోపీచంద్ క్రేజ్ కూడా పెరుగుతుంది కానీ తగ్గలేదు. పర్ఫెక్ట్ గా అతనికి తగ్గట్టుగా ఒక మాస్ స్టోరీ పడితే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే వస్తుందని చెప్పవచ్చు.

గోపీచంద్ చివరిగా నటించిన రామబాణం సినిమా కూడా ధారణంగా దెబ్బకొట్టింది. ఇక ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం భీమా అన్స్ సినిమా పైనే ఉంది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష డైరెక్ట్ చేస్తున్న భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ హై బడ్జెట్ చిత్రం యొక్క యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో హీరో గోపిచంద్ హై వోల్టేజ్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. ఖాకీ దుస్తుల్లో కోర మీసాలతో పోలీసు జీపు బానెట్‌పై కూర్చున్న గోపీచంద్ గూండాలను తాళ్లతో లాగుతున్నాడు.

గోపిచంద్ మరోసారి పోలీసు గెటప్‌లో చురుగ్గా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు ఇతర ఎలిమెంట్స్‌తో కూడిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గోపిచంద్ కు తప్పకుండా హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు గోపిచంద్ చేసిన పోలీస్ క్యారెక్టర్స్ అతనికి మంచి ఫలితాలను అందించాయి. ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలు గోపి కెరీర్ లొనే బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. ఇక మరోసారి గోపిచంద్ తనకు.కలిసొచ్చిన పొలీస్ గెటప్ అనే ఆయుధాన్ని వాడుతున్నాడు.

భీమా సినిమాకు స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీలో ఫైట్స్ ఉండబోతున్నాయి. గోపిచంద్ మాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు టాక్. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.