Begin typing your search above and press return to search.

గోపి.. ఏదైనా సాహసం చేస్తేనే..

ప్రభాస్ రాధే శ్యామ్ తో డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు అంతకుముందు తన మొదటి సినిమాలో గోపీచంద్ తో చేశాడు. జిల్ అనే ఆ సినిమాను UV నిర్మించింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 6:40 AM GMT
గోపి.. ఏదైనా సాహసం చేస్తేనే..
X

మాస్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న గోపీచంద్ ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. అతనితో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అనేలా నిర్మాతలు నమ్మకంతో పెట్టుబడి పెట్టేవారు. కానీ ఇప్పుడు గోపీచంద్ సినిమాలు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆయనతో సినిమాలు చేసే దర్శకుల రేంజ్ కూడా అంత పెద్దగా ఏమీ లేదు.

నచ్చితే కొత్త దర్శకులతో చేస్తున్నారు. లేదంటే ఫ్లాప్ లిస్టులో అవకాశాలు లేక సతమతమవుతున్న దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అప్పట్లో కృష్ణవంశీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులతో గోపీచంద్ ప్రయోగాలు చేసినప్పటికీ అవేమి కెరీర్ రేంజ్ ను పెంచలేదు. ముఖ్యంగా కృష్ణవంశీతో చేసిన మొగుడు అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆ దర్శకుడు కూడా మళ్ళీ ఫాలోకి రాలేదు.

ఇక ఇప్పుడు గోపీచంద్ చేయబోయే సినిమాల దర్శకులు కూడా ఫామ్ లేక సతమతమవుతున్న వారే. ముఖ్యంగా శ్రీను వైట్లతో ఇటీవల గోపీచంద్ ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ నుంచి జనాలు ఇలాంటి అంశాలను ఒకప్పుడు కోరుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అలాంటి ఆలోచన ధోరణి చాలా తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచించుకోవాలి.

తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పవర్ఫుల్ కంటెంట్ తోనే ఏదైనా కొత్త తరహా సాహసం చేయాలి. అలాగే రీసెంట్గా గోపీచంద్ తో రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ తో కూడా ప్రాజెక్టుకు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ రాధే శ్యామ్ తో డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు అంతకుముందు తన మొదటి సినిమాలో గోపీచంద్ తో చేశాడు. జిల్ అనే ఆ సినిమాను UV నిర్మించింది.

అయితే ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ రిపీట్ కాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీనువైట్ల, రాధాకృష్ణ ఇద్దరి కెరియర్ ట్రాక్ అంతగా హైప్లో లేదు. గోపీచంద్ గతంలో చంద్రశేఖర్ యేలేటి తో చేసిన సాహసం అతనికి కెరీర్ లొనే బెస్ట్ డిఫరెంట్ సినిమాగా చెప్పవచ్చు. రాంగ్ టైం లో రావడం వలన సాహసం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్ రాబట్టలేదు. కానీ అలాంటి డిఫరెంట్ సినిమా చేస్తే మాత్రం గోపిచంద్ కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పట్లో కమర్షియల్ సినిమాలు హిట్ అంటే ఎన్నో అంశాలు కలిసి రావాలి. కానీ గోపీచంద్ ఇప్పుడు ఆ అదృష్టానికి చాలా దూరంలో ఉన్నాడు. కాబట్టి డిఫరెంట్ కంటెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుని మార్కెట్ ను కాపాడుకుంటే బెటర్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి.