Begin typing your search above and press return to search.

గోపిచంద్ తో మల్టీస్టారరా?

స్టార్ హీరోలు అందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా కథలపైన దృష్టిపెట్టారు.

By:  Tupaki Desk   |   31 July 2024 5:14 PM GMT
గోపిచంద్ తో మల్టీస్టారరా?
X

సినిమా చూపిస్త మామా, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే రా, ధమాకా సినిమాలతో వరుస కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన. టాలీవుడ్ లో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. రైటర్ ప్రసన్నకుమార్, త్రినాథ్ రావు నక్కిన కాంబినేషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

ప్రస్తుతం ఈ దర్శకుడు సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా ప్రసన్నకుమార్ కథ అందించడం విశేషం. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలు అందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా కథలపైన దృష్టిపెట్టారు. మేగ్జిమమ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు వారు అవైడ్ చేశారని చెప్పొచ్చు.

ఈ నేపథ్యంలో త్రినాథ్ రావు నక్కిన టైర్ 2, హీరోల పైన ఫోకస్ చేశారు. అలాగే ఓ మల్టీస్టారర్ కథపై కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు మ్యాచో స్టార్ గోపీచంద్ కి రీసెంట్ గా కథ చెప్పి ఒకే చేయించుకున్నారంట. అందులో మరో హీరో కూడా నటిస్తారని ఒక గాసిప్ వైరల్ అవుతోంది. ప్రసన్నకుమార్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో కథ సిద్దమవుతున్నట్లు సమాచారం. నిర్మాతలైన భగవాన్, పుల్లారావు త్రినాథ్ రావు నక్కినకి గతంలో అడ్వాన్స్ ఇచ్చారంట. గోపీచంద్ డేట్స్ కూడా వారి దగ్గర ఉన్నాయంట.

ముందుగా గోపిచంద్ ను లాక్ చేసుకున్న దర్శక నిర్మాతలు మరో హీరో పాత్ర కోసం సెర్చ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైనర్ గా కథను రెడీ చేస్తున్నట్లు టాక్. గోపిచంద్ హీరోగా ఇప్పటివరకు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. పర్ఫెక్ట్ గా ఇద్దరు హీరోలు సెట్టయితేనే ఆ కథ ముందుకు వెళ్లే అవకాశం ఉందట. మరి గోపిచంద్ కు ధీటుగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

ఇక గోపీచంద్ కూడా మంచి సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. లౌక్యం తర్వాత ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇప్పటి వరకు మరల గోపీచంద్ కి పడలేదు. ప్రస్తుతం గోపీచంద్ శ్రీనవైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కథ ఉండబోతోంది. సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. దీని తర్వాత త్రినాథ్ రావు సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది.