Begin typing your search above and press return to search.

రవితేజ - గోపిచంద్ మలినేని.. మరో రియల్ కథ?

సమాజంలో జరిగే కొన్ని రియల్ లైఫ్ ఘోరాలు అప్పుడప్పుడు సినిమాలుగా తెరపైకి వస్తూ ఉంటాయి

By:  Tupaki Desk   |   15 Aug 2023 4:26 AM GMT
రవితేజ - గోపిచంద్ మలినేని.. మరో రియల్ కథ?
X

సమాజంలో జరిగే కొన్ని రియల్ లైఫ్ ఘోరాలు అప్పుడప్పుడు సినిమాలుగా తెరపైకి వస్తూ ఉంటాయి. వాస్తవిక సంఘటనలని యధావిధిగా చాలా మంది సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తారు. వీటిలో హీరో, హీరోయిన్స్ పాత్రలకి ఛాయస్ ఉండదు. కేవలం ఆ ఘటన, అందులో బాధించే వారు, బాధింపబడే వారు మాత్రం పాత్రధారులుగా ఉంటారు. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మధ్య తన సినిమాల కోసం రియల్ లైఫ్ సంఘటనలని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని ఇప్పుడు నాలుగో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాల్ని వీరిద్దరూ సొంతం చేసుకున్నారు. చివరిగా చేసిన క్రాక్ మూవీని ఒంగోలులో జరిగిన రియల్ సంఘటనలని, వ్యక్తులని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించారు. అందులోని సముద్రఖని పోషించిన పాత్రని రియల్ గా రౌడీయిజం చేసిన వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేశారు. ఇప్పటికి ఆ వ్యక్తి ఉన్నారు. అయితే రౌడీయిజం మానేసి వ్యాపారం చేసుకుంటున్నారు.

ఇప్పుడు నాలుగో మూవీ కోసం అలాంటి రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనని ఆధారంగా చేసుకొని కథ సిద్ధం చేసుకున్నారు. దానిచుట్టూ ఒక ఫిక్షనల్ హీరో క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసి రవితేజతో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాలు, దళితుల మధ్య జరిగిన కుల ఘర్షణ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆ ఘటనలో ఎనిమిది మంది దళితులని అత్యంత దారుణంగా నరికి చంపేశారు. ఆ ఘటనపై ఇప్పటికి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ చుండూరు మారణహోమం నేపథ్యంలోనే రవితేజ, గోపీచంద్ నాలుగో సినిమా రాబోతోంది. ఈ సినిమాకి తమన్ స్వరాలు అందించబోతున్నాడు. ప్రస్తుతం రవితేజ ఈగల్ మూవీ షూటింగ్ లో ఉన్నారు.

ఇది పూర్తయిన వెంటనే గోపీచంద్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.