గోపీచంద్ తో డార్లింగ్ కలిసాడంటే తెల్లారినట్లే!
ఇక గోపీచంద్ గురించి డార్లింగ్ కూడా అంతే ఆసక్తిగా చెబుతుంటాడు. గోపీ గోపీ అంటూ ఎంతో స్నేహంగా ఉంటాడు.
By: Tupaki Desk | 8 Aug 2023 11:30 PM GMTడార్లింగ్ ప్రభాస్-మ్యాచో స్టార్ గోపీచంద్ స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఇద్దరు మంచి స్నేహితులు. బాల్య స్నేహితులు కాదు గానీ...మరి వీరి స్నేహ ఎలా అంటే? గోపీచంద్ ఆ విషయాలు రివీల్ చేసారు. నా మంచి చెడులన్ని చూసుకునే ప్రాణ స్నేహితుడు ప్రభాస్.
తను సినిమాల్లోకి రాక ముందు నుంచే పరిచయం. ఇద్దరి లో కామన్ పాయింట్ సిగ్గు. అభిరుచులు కూడా కలిసాయి. 'వర్షం' సినిమాతో క్లోజ్ ప్రెండ్స్ అయ్యాం. అందులో ఇద్దరం కలిసి నటించడం ఇద్దరి స్నేహం స్ట్రాంగ్ అయింది.
అప్పుడా సినిమా కలిసి చేయడం అన్నది యాదృశ్చికంగా జరిగినా.. కానీ ఇప్పుడు ఇద్దరం ఓ సినిమాలో నటించాలనుకుంటున్నాం. ఇద్దరం కలిసామంటే గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటాం. ఒక్కోసారి తెల్లారిపోతుంది. ఎంత సమయమైనా కబుర్లుకు సరిపోదనిపిస్తుంది. సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సలహాలు ఇచ్చి పుచ్చుకుంటాం.'జిల్ 'సినిమా స్టోరీ విని నా హెయిర్ స్టైల్ తనే మార్పించాడు.
నేను కూడా డార్లింగ్ ని షూటింగ్ సమయంలో స్టంట్స్ చేయోద్దని చెబుతుంటా. ఆ విషయంలో ప్రభాస్ కి చాలాసార్లు గాయాలయ్యాయి. వాటిని లెక్క చేయడు. మొండిగా ఉంటాడు. సినిమానే పస్ట్ అంటూ స్టంట్లు చేస్తుంటాడు.తనలో ఆ రకమైన అంకిత భావం నాకెంతో నచ్చుతుంది' అని అన్నారు.
ఇక గోపీచంద్ గురించి డార్లింగ్ కూడా అంతే ఆసక్తిగా చెబుతుంటాడు. గోపీ గోపీ అంటూ ఎంతో స్నేహంగా ఉంటాడు.
గోపీచంద్ తన ఆడియో ఫంక్షన్లకు పిలవడని..అలాంటి సమయంలో నన్ను మర్చిపోతాడని హాస్యాస్పదంగా అంటుంటారు. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో గోపీచంద్ ప్రెండ్ అయినా అడ్వాటేంజ్ తీసుకోరు. స్నేహం..సినిమా వేర్వేరుగా చూస్తుంటారు. మాటల సందర్భంలోనే ఇద్దరు కలిసి ఓ సినిమా చేయాలని ఉంది అన్న విషయాన్ని గోపీచంద్ రివీల్ చేసారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో? ఆ ఛాన్స్ ఏ దర్శకుడు అందుకుంటాడో చూడాలి.