Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్..నేను సిద్ద‌మే కానీ?

డార్లింగ్ ప్ర‌భాస్- మ్యాచ్ స్టార్ గోపీచంద్ క‌లిసి ఎప్పుడు సినిమా చేయ‌బోతున్నార‌ని అభిమానులు ఎంతో కాలంగా ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 March 2024 6:11 AM GMT
ప్ర‌భాస్..నేను సిద్ద‌మే కానీ?
X

డార్లింగ్ ప్ర‌భాస్- మ్యాచ్ స్టార్ గోపీచంద్ క‌లిసి ఎప్పుడు సినిమా చేయ‌బోతున్నార‌ని అభిమానులు ఎంతో కాలంగా ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిన ద‌గ్గ‌ర నుంచి ఈ ప్ర‌శ్న త‌రుచూ తెర‌పైకి వ‌స్తూనే ఉంది. స్నేహితుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు? మరి ఆ ప్రాణ స్నేహి తుడు కూడా పాన్ ఇండియా స్టార్ ని చేసేదెప్పుడు? అందుకు డార్లింగ్ సిద్దంగా ఉన్నాడా? అని చాలాసార్లు అభిమానులు కోరారు.

తాజాగా వాట‌న్నింటిపై గోపీ చంద్ క్లారిటీ ఇచ్చేసారు. ఇద్ద‌రు క‌లిసి సినిమా చేయ‌డా నికి సిద్దంగా ఉన్నామ‌ని..కానీ క‌థే కుద‌ర‌డం లేద‌ని తొలిసారి ఓపెన్ అయ్యారు. ఇంత‌కు మందు చాలాసార్లు ఈ ప్ర‌శ్న గోపీచంద్ ముందుకు వెళ్లినా? స్కిప్ కొట్టేవారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి స్కిప్ లు లేకుండా డైరెక్ట‌ర్ అన్స‌ర్ ఇచ్చారు. అలా స్కిప్ కొట్ట‌డానికి అనేక కార‌ణాలుండేవి అనుకోండి. కానీ ఈసారి ఆఛాన్స్ తీసుకో లేదు. ఇద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్నామ‌ని అన్నారు.

కానీ ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో? వ‌చ్చిన‌ప్పుడు ఆలోచించ‌కుండా ముందుకు వెళ్తాం అన్నారు. గోపీచంద్ క్లారిటీతో ఇద్ద‌రి ఇమేజ్ కి త‌గ్గ స్టోరీ దొరికడ‌మే ఆల‌స్యం అనిపిస్తుంది. గోపీచంద్ ఇంత‌వ‌ర‌కూ పాన్ ఇండియా లో సినిమాలు చేయ‌లేదు. అలాగే 100 కోట్ల క్ల‌బ్ లోనూ చేర‌లేదు. కొంత కాలంగా ఆయ‌న‌కు స‌రైన స‌క్సెస్ లేని సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. మార్కెట్ ప‌రంగానూ కాస్త డౌన్ లోనే ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలో డార్లింగ్ తో సినిమా అంటూ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం అభిమానుల్లో జోష్ ని నింపుతుంది. ప్ర‌భాస్-గోపీ చంద్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు వ‌ర్షం సినిమాలో క‌లిసి న‌టించిన సంగ‌తి విధిత‌మే. అందులో ప్ర‌భాస్ హీరో అయితే..గోపీచంద్ విల‌న గా న‌టించాడు. మ‌రి కొత్త సినిమాలో ఇద్దరు హీరోల‌వుతారా? వ‌ర్షం సన్నివేశాన్ని త‌ల‌పిస్తారా? అన్న‌ది చూడాలి.