Begin typing your search above and press return to search.

విశ్వం.. అల్ట్రా స్టైలిష్ మోడ్ లో గోపీచంద్

టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపీచంద్.. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Jun 2024 9:21 AM GMT
విశ్వం.. అల్ట్రా స్టైలిష్ మోడ్ లో గోపీచంద్
X

టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపీచంద్.. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో కనిపించిన గోపీచంద్.. ఆ తర్వాత హీరోగా మారిపోయారు. యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కొన్ని నెలలుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. సాలిడ్ హిట్ ను మాత్రం అందుకోలేక పోతున్నారు ఈ టాల్ హీరో.

ఇటీవల భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గోపీచంద్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ విశ్వంపై అంచనాలన్నీ పెట్టుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఈద్ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలతో యమా స్టైలిష్ గా కనిపించారు.

ఇప్పుడు విశ్వం మూవీ నుంచి గోపీచంద్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బర్త్ డే విషెస్ తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ లో గోపీచంద్ వేరే లెవల్ లో ఉన్నారు. క్యాప్, స్పెక్ట్స్ పెట్టుకుని.. స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ స్టైలిష్ గా కనిపిస్తూ అలరిస్తున్నారు. దీంతో ఈ మూవీతో గోపీచంద్ కమ్ బ్యాక్ ఇవ్వడం పక్కాగా తెలుస్తోంది.

అయితే దర్శకుడు శ్రీను వైట్ల... తన సినిమాల్లో హీరోలను కొత్తగా చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వంలో గోపీచంద్ ను కూడా లైట్ గడ్డంతో అల్ట్రా స్టైలిష్ మోడ్ లో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ రోల్ ప్రామిసింగ్ గా ఉంది. డైలాగ్స్ చెప్పిన విధానం చూస్తే.. హీరో క్యారెక్టర్ కు గ్రే షేడ్‌ ను యాడ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక విశ్వం మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‌‌ పై వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీను వైట్ల పలు బ్లాక్‌ బస్టర్స్‌ తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. మరి ఈ మూవీతో గోపీచంద్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.