Begin typing your search above and press return to search.

'గొర్రె పురాణం' ఓటీటీ అప్‌డేట్‌

రెండు వారాల్లోనే సినిమాను ఇలా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 11:51 AM GMT
గొర్రె పురాణం ఓటీటీ అప్‌డేట్‌
X

కలర్‌ ఫోటోతో మంచి గుర్తింపు దక్కించుకున్న సుహాస్‌ వరుసగా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరోగా సుహాస్‌ సినిమా సినిమాకు మంచి గుర్తింపు, పేరును సొంతం చేసుకున్నారు. తాజాగా గొర్రె పురాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత నెల 20వ తారీకున థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఆహా ఓటీటీ వారు అప్పుడే స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. రెండు వారాల్లోనే సినిమాను ఇలా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


థియేటర్‌ల ద్వారా విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్‌ స్పందన రాలేదు. పైగా థియేటర్‌లలో సినిమా దేవర ఉన్న కారణంగా మొత్తం తీశారు. దాంతో ఓటీటీ కోసం వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదని, నాలుగు వారాల తర్వాత అనుకున్న సినిమాను ముందుగానే స్ట్రీమింగ్‌ చేయాలని మేకర్స్ భావించారు. అందుకే సుహాస్‌ నటించిన గొర్రెపురాణం సినిమా అప్పుడో ఓటీటీ లోకి వచ్చింది. థియేటర్‌ లో చూడని ప్రేక్షకులు ఓటీటీ లో కచ్చితంగా చూస్తారు అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్‌ తో ఈ సినిమా హిట్‌ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సుహాస్‌ తో పాటు ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, రఘు నటించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కథ ఎక్కువగా గొర్రె చుట్టూ తిరుగుతుంది. గొర్రె వల్ల ఏం జరిగింది, రెండు మతాల మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి అనేది అనేది చూపించే ప్రయత్నం చేశారు. చిన్న పాయింట్‌ ను పెద్దగా చూపించేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నంను అభినందించాల్సిందే. అయితే ఆయన ఇంకాస్త క్లీయర్ గా స్క్రీన్‌ప్లే నడిపించి ఉంటే బాగుండేది అంటూ రివ్యూలు రావడంతో పాటు, చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమాలో సుహాస్ పాత్ర ఏంటి అనేది ట్రైలర్ లో రివీల్‌ చేయక పోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాలో అనుకున్నట్లుగానే సుహాస్ పాత్ర స్పెషల్‌ గా ఉంది. ఆయన నటించిన ఈ సినిమా మరోసారి నటుడిగా మంచి మార్కులు పడేలా చేసింది. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌, ప్రసన్నవదనం, రైటర్‌ పద్మభూషన్ సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుహాస్‌ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓటీటీ లో గొర్రె పురాణంకు మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు జనక అయితే గనక అనే సినిమాతో సుహాస్ వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.