RC 16 కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. సెట్టయితే లాభమే..
మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
By: Tupaki Desk | 15 Dec 2024 2:30 PM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ చ్చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మీర్జాపూర్ యాక్టర్ దివ్యేందు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే జగపతిబాబుని కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. వీరు ఎలాంటి పాత్రలలో కనిపించాబోతున్నారనేది క్లారిటీ లేదు. ఉత్తరాంద్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కాజోల్ సౌత్ ధనుష్ ‘VIP 2’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె హీరోయిన్ గా 1996 ‘మిన్సార కనువు’ అనే మూవీలో ప్రభుదేవాకి జోడీగా నటించింది.
రాజీవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఇక తరువాత సౌత్ లో సినిమాలు చేయలేదు. మరల ధనుష్ ‘VIP 2’ లోనే కనిపించింది. తెలుగు సినిమాలలో మాత్రం ఇప్పటి వరకు ఆమె నటించలేదు. ఒక వేళ ‘RC 16’ లో కాజోల్ భాగం అయితే ఇదే ఆమె ఫస్ట్ తెలుగు సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఆమె ఫ్యాన్స్ కూడా తెలుగులో కాజోల్ ని ఒక్క సినిమాలో అయిన చూడాలని కోరుకుంటున్నారు. ఒక వేళ కాజోల్ ఈ చిత్రంలో నటిస్తే మాత్రం కచ్చితంగా హిందీ మార్కెట్ లో మంచి క్రేజ్ వస్తుంది.
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు బాలీవుడ్ మార్కెట్ ను కూడా దృష్టిలో ఉంచుకొని కాజోల్ ని సంప్రదిస్తున్నట్లు టాక్. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా ఆమె నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే కాజోల్ చివరిగా దోపత్తి సినిమాలో కనిపించింది. ‘మహారాగ్ని’ అనే యాక్షన్ మూవీతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తెలుగు డైరెక్టర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన తెలుగులో ‘మళ్ళీ మొదలైంది’, ‘స్పై’ సినిమాలని నిర్మించారు. ఇప్పుడు దర్శకుడిగా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.