Begin typing your search above and press return to search.

విజయ్ తర్వాత నానితో ఫిక్సా..?

వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సరిపోదా శనివారం సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు

By:  Tupaki Desk   |   20 April 2024 4:47 AM GMT
విజయ్ తర్వాత నానితో ఫిక్సా..?
X

వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సరిపోదా శనివారం సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. నానితో ఆల్రెడీ అంటే సుందరానికీ సినిమా తీసిన ఈ డైరెక్టర్ ఈసారి సరికొత్త కథతో వస్తున్నాడు. శనివారం మాత్రం ఫైట్ చేసే హీరోగా నాని సరిపోదా శనివారం తో సర్ ప్రైజ్ చేయనున్నాడు.

ఈ సినిమా తర్వాత సుజిత్ తో సినిమా లాక్ చేసుకున్నాడు నాని. సరిపోదా శనివారం ప్రొడక్షన్ లోనే సుజిత్ డైరెక్షన్ లో సినిమా రాబోతుంది. సుజిత్ తను చేస్తున్న ఓజీ షూటింగ్ పూర్తైన వెంటనే నాని సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెలతో మరో భారీ సినిమా లైన్ లో పెట్టాడు. నానికి దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల మరోసారి దానికి మించిన సబ్జెక్ట్ తో వస్తున్నాడని తెలుస్తుంది.

సో నాని చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇదే కాకుండా మరో డైరెక్టర్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అతనెవరో కాదు జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి. నాని కెరీర్ లో జెర్సీ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. జెర్సీ సినిమాతోనే నానికి నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతం తిన్ననూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాకు రెడీ అవుతున్నాడు.

విజయ్ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి నానితోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నాని కూడా గౌతం తో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. జెర్సీ సినిమాతోనే గౌతం టాలెంట్ ఏంటో అర్థమైంది. విజయ్ దేవరకొండతో స్పై థ్రిల్లర్ చేస్తున్న గౌతం నాని కోసం మరో అద్భుతమైన కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది. జెర్సీ రిలీజై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా గౌతం తిన్ననూరి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నానితో కలిసి ఈరోజు సుదర్శన్ 35 లో ఆ సినిమా చూడనున్నారు. ఇదే మూమెంట్ లో గౌతం తిన్ననూరితో తన సినిమా అనౌన్స్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంది. విజయ్ తో చేస్తున్న సినిమా హిట్ పడితే మాత్రం నాని సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అందుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.