పెరిగిన బాలీవుడ్, కోలీవుడ్.. వెనకబడ్డ టాలీవుడ్?
కానీ 2023 వచ్చేసరికి అంతా తారుమారు అయిపోయింది. ఈ సంవత్సరంలో బాలీవుడ్ తరఫున ఏకంగా మూడు సినిమాలు రూ.500 కోట్ల నెట్ వసూళ్లు సాధించాయి.
By: Tupaki Desk | 4 Dec 2023 10:45 AM GMTబాహుబలి సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి భారీ గుర్తింపు దక్కడంతో గ్లోబల్ వైడ్ గా తెలుగు సినిమాకి మార్కెట్ ఓపెన్ అయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం టాలీవుడ్ లో పెద్దగా గ్రోత్ ఏం కనిపించలేదు. గత సంవత్సరం వరకు బాలీవుడ్ నెట్ కలెక్షన్స్ రూ.300 కోట్లు దాటలేదు. 2022లో కనీసం ఒక్క సినిమా కూడా రూ.400 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది లేదు.
కానీ 2023 వచ్చేసరికి అంతా తారుమారు అయిపోయింది. ఈ సంవత్సరంలో బాలీవుడ్ తరఫున ఏకంగా మూడు సినిమాలు రూ.500 కోట్ల నెట్ వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది ఆరంభంలో 'పఠాన్' ఈ ఘనత సాధిస్తే ఆ తర్వాత 'గదర్ 2' రీసెంట్ గా 'జవాన్' వాటిని కంటిన్యూ చేస్తూ వచ్చాయి. ఇక ఇప్పుడు 'యానిమల్' కూడా రూ.500 కోట్ల క్లబ్లో చేరెందుకు సిద్ధమవుతోంది. 'యానిమల్' తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ లో రాబోయే 'డంకీ' కూడా ఈ క్లబ్ లో చేరడం గ్యారెంటీ అని చెబుతున్నారు.
ఈ ఏడాది హిందీ సినిమాలకు ఇండియా వైడ్ గానే కాదు ఓవర్సీస్ లోనూ గ్రాఫ్ బాగా పెరిగింది. ఇక కోలీవుడ్లో చూసుకుంటే పెద్ద హీరోల మార్కెట్ రూ.300 నుంచి రూ.400 కోట్లు ఉండేది. దళపతి విజయ్, రజనీకాంత్ సినిమాలు మినహాయిస్తే మరే సినిమా అక్కడ రూ.350 కోట్ల మార్కులు దాటలేకపోయింది. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే రజినీకాంత్ 'జైలర్' రూ.625 కోట్లు 'లియో' రూ.594 కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఈ కలెక్షన్స్ తో కోలీవుడ్ మార్కెట్ కూడా పెరిగిపోయింది.
కానీ మన తెలుగుల మార్కెట్ చూసుకుంటే ఇంతకుముందు ఏ స్టేజ్ లో ఉందో ఇప్పుడు అదే స్టేజిలో ఉంది. ఈ సంవత్సరం టాలీవుడ్ మార్కెట్ లో ఎలాంటి గ్రోత్ కనిపించలేదు. ఇప్పటికీ తెలుగు సినిమాలు రూ.300 కోట్ల మార్క్ ని దాటేందుకు కష్టపడుతూనే ఉన్నాయి. ఒక్క రాజమౌళి సినిమాలు మినహాయిస్తే మరే సినిమా కూడా ఇప్పటివరకు తెలుగు మార్కెట్లో రూ.300 కోట్ల మార్క్ దాటింది లేదు.
ఈ క్రమంలోనే ఇప్పుడు అందరి దృష్టి 'సలార్' సినిమా పైనే ఉంది. కచ్చితంగా ఈ మూవీ రూ.500 కోట్ల మార్క్ అందుకుంటుందని అంటున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.