బిగ్ బాస్ 8 : ఫైనల్ గెస్ట్ ఎవరో తెలుసా.. పూనకాలు ఫిక్స్..!
బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 15 ఆదివారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ రాబోతుంది. ఇప్పటికే హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసింది.
By: Tupaki Desk | 12 Dec 2024 6:23 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 15 ఆదివారం సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ రాబోతుంది. ఇప్పటికే హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసింది. వీరిలో ఫైనల్ గా టైటిల్ విజేత ఎవరన్నది తెలియాల్సి ఉంది. టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ ని చూస్తే నిఖిల్, గౌతం లు టైటిల్ రేసులో పోటా పోటీ పడుతున్నారు. మరోపక్క ఆడపులిలా ఆడుతున్న ప్రేరణ టాప్ 3 కి వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. ఆ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అవినాష్, ఫిఫ్త్ ప్లేస్ లో నబీల్ ఉన్నారు. అవినాష్, ప్రేరణలు అసలు టాప్ 5 దాకా వస్తారా అన్న డౌట్ మూడు నాలుగు వారాల క్రితం ఉండేది.
అవినాష్ ఫినాలే టికెట్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. మనకేంటి ఫైనలిస్ట్ అయ్యాం కదా అని రిలాక్స్ అవ్వకుండా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. ఇక మరోపక్క ప్రేరణ టాప్ 5 అయ్యాం కదా అని కాకుండా బీబీ సీరియల్ పరివార్ తో కలిసి ఆడుతున్న ఆటల్లో అదరగొట్టేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి సర్ ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారట.
ఈ మధ్యనే థియేటర్ లో పుష్ప రాజ్ పాత్రలో పూనకాలు తెప్పించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి రాబోతున్నాడని తెలుస్తుంది. సీజన్ 8 ఎపిసోడ్ కి అల్లు అర్జున్ వస్తే మాత్రం అది నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న షో ఇదే అని చెప్పొచ్చు. మరి ఈ ఫైనల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది. కింగ్ నాగార్జున పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ గురించి ఎలా మాట్లాడుతారన్నది చూడాలి.
సో ఈ సీజన్ ఫైనల్ విన్నర్ అల్లు అర్జున్ చేత టైటిల్ అందుకోబోతున్నాడని తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ టీం నుంచి అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది. బిగ్ బాస్ స్టేజ్ మీద పుష్ప రాజ్ వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ టి.ఆర్.పి మోత మోగిపోద్దని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది హైలెట్ ఎపిసోడ్ గా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు.