Begin typing your search above and press return to search.

నేడే నాగచైతన్య, శోభిత వివాహం.. పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారంటే?

టాలీవుడ్ హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఈరోజు (డిసెంబర్ 4) జరగనుంది. మరికొన్ని గంటల్లో ఈ జంట వివాహం బంధంతో అడుగుపెట్టబోతున్నారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 6:47 AM GMT
నేడే నాగచైతన్య, శోభిత వివాహం.. పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారంటే?
X

టాలీవుడ్ హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఈరోజు (డిసెంబర్ 4) జరగనుంది. మరికొన్ని గంటల్లో ఈ జంట వివాహం బంధంతో అడుగుపెట్టబోతున్నారు. అక్కినేని ఫ్యామిలీ సెంటిమెంట్ గా భావించే అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారని తెలుస్తోంది.

నాగచైతన్య, శోభిత పెళ్లి కోసం అన్నపూర్ణ స్టుడియోస్ అందంగా ముస్తాబైంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఎంతో ఘనంగా వీరి వివాహం నిర్వహిస్తున్నారు. ఈరోజు బుధవారం రాత్రి 8 గంటల 13 నిమిషాలకు చైతూ.. శోభిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారని సమాచారం. శోభిత తన పెళ్లికోసం బంగారు జరీ వర్క్‌తో కూడిన కాంచీవరం పట్టుచీరను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య సంప్రదాయ బద్దంగా పంచె కట్టులో కనిపించబోతున్నారు.

గత కొన్ని రోజులుగా చైతన్య, శోభితల ప్రీ-వెడ్డింగ్ ఫార్మిలీటీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలో భాగంగా కాబోయే వధూవరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి కొడుకుగా, శోభితను పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో కొంతమంది సినీ ప్రముఖులు, స్నేహితులకు చైతన్య ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చై - శోభిత పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. మూడు వందల నుంచి నాలుగు వందల మంది అతిథులు వచ్చే అవకాశం ఉందని అక్కినేని నాగార్జున ఇటీవలే తెలిపారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, హీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ సహా సినీ ఇండస్ట్రీకి చెందిన ముఖ్యులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి ఈ పెళ్ళికి హాజరుకానున్నారట.

నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగేళ్లకు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు శోభిత దూళిపాళ్లతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చైతూ సిద్ధమయ్యారు. శోభితతో కలిసి జీవితాన్ని పంచుకోడానికి ఎదురుచూస్తున్నానని ఇటీవల తన బర్త్ డే సందర్భంగా నాగ చైతన్య అన్నారు. ఆమెతో డీప్ గా కనెక్ట్ అయ్యానని, తనను చాలా బాగా అర్థం చేసుకుందని చెప్పారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని, తమది అద్భుతమైన ప్రయాణం అవుతుందని చైతూ పేర్కొన్నారు.