Begin typing your search above and press return to search.

ఆ మూవీ రిలీజ్ కి ముందే గిన్నిస్ రికార్డ్‌..!

ఇంగ్లీష్ తో పాటు పాన్‌ వరల్డ్‌ రేంజ్ లో పదుల సంఖ్య భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు గాను ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

By:  Tupaki Desk   |   25 July 2024 9:50 AM GMT
ఆ మూవీ రిలీజ్ కి ముందే గిన్నిస్ రికార్డ్‌..!
X

హాలీవుడ్‌ సినిమా 'డెడ్‌ పూల్ అండ్‌ వోల్వరైన్‌' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు పాన్‌ వరల్డ్‌ రేంజ్ లో పదుల సంఖ్య భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు గాను ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.


జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రేయాన్ రెనాల్డ్స్‌ మరియు హ్యూ జాక్ మాన్‌ లు హీరోలుగా నటించారు. ఈ హీరోలు ఇద్దరు సినిమా విడుదలకు ముందే గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ ను సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.


రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ ను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఆ ట్రైలర్‌ ఒక్క రోజులోనే ఏకంగా 365 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏ సినిమా ట్రైలర్ కూడా యూట్యూబ్‌ లో అంతటి వ్యూస్‌ ను సొంతం చేసుకోలేదు.

యూట్యూబ్‌ లో నమోదు అయిన రికార్డ్‌ ను గిన్నిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో నమోదు చేయలని మేకర్స్ భావించారు. అందుకోసం గిన్నిస్ బుక్‌ వారిని సంప్రదించగా వారు పరిశీలించి, తప్పకుండా ఈ అరుదైన రికార్డ్‌ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందే అనుకున్నారు.

తాజాగా హీరోలు ఇద్దరు కూడా సంయుక్తంగా ట్రైలర్‌ దక్కించుకున్న రికార్డ్‌ కు సంబంధించిన గిన్నిస్ రికార్డ్‌ ను అందుకున్నారు. సినిమా విడుదల ముందు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల భారీ ప్రమోషన్ దక్కినట్లు అయ్యిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.