Begin typing your search above and press return to search.

రకుల్ ఆట చూశారా.. ఎంత అందంగా ఉందొ..

ఆమె నటనతో పాటు అందం కూడా ఆమెను ప్రేక్షకుల మనసుకు దగ్గర చేసింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 10:50 AM GMT
రకుల్ ఆట చూశారా.. ఎంత అందంగా ఉందొ..
X

రకుల్ ప్రీత్ సింగ్.. మొదట మోడల్ గా మాంచి క్రేజ్ అందుకున్న ఈ పంజాబీ సొగసరి, కేరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ అనంతరం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకొని వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆమె నటనతో పాటు అందం కూడా ఆమెను ప్రేక్షకుల మనసుకు దగ్గర చేసింది.

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో జతకట్టి, తన కెరీర్‌లో బలమైన స్థానం సంపాదించుకుంది. నాగ చైతన్యతో రారండోయ్, కింగ్ నాగార్జునతో మన్మథుడు 2 వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తెలుగులో చివరిగా వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం సినిమాలో కనిపించింది.

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొని, అక్కడ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుసగా వచ్చిన ఆఫర్లతో, టాలీవుడ్‌కు కొంత దూరమైంది. అయితే, ఆమె తెలుగు సినిమాలపై అభిమానాన్ని కోల్పోలేదు. కేవలం కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడం వల్లే కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం రకుల్‌ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో వివాహం చేసుకొని, వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నటిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఇండియన్ 2 సినిమాలో నటించిన ఆమె, తదుపరి హిందీ ప్రాజెక్టులు ‘దే దే ప్యార్ దే 2’ మరియు ‘మేరీ పత్ని కా రీమేక్’ వంటి సినిమాల్లో భాగమవుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా రకుల్ ప్రీత్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ, తరచూ తన ఫోటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల గోల్ఫ్ ఆడుతూ తీసుకున్న వీడియోలను షేర్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో అమ్మడు చిన్న స్కర్ట్ లో కనిపించింది. వీడియోను లక్షల మందికి పైగా లైక్ చేసి, ఆమె అందంగా ఉందని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.