హిట్ సినిమాకి సీక్వెల్..కానీ వాళ్లు కాదు!
ఏదో ఒక రోజు నాకు టైమ్ వస్తుందనే నమ్మ `గల్లిబోయ్` కుర్రాడి పాత్రలో రణవీర్ సింగ్ నటన విమర్శ లకు ప్రశంసలందుకునేలా చేసింది.
By: Tupaki Desk | 13 Jan 2025 6:25 AM GMTబాలీవుడ్ లో రిలీజ్ అయిన `గల్లీ బోయ్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ముంబై మురికి వాడల్లో నివసిస్తూ ర్యాంప్ సింగర్ కావాలని కలలు కనే మురాద్ అనే అబ్బాయి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. రణవీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. తమ పాత్రల్లో ఇద్దరు ఒదిగిపోయారు. ఏదో ఒక రోజు నాకు టైమ్ వస్తుందనే నమ్మ `గల్లిబోయ్` కుర్రాడి పాత్రలో రణవీర్ సింగ్ నటన విమర్శ లకు ప్రశంసలందుకునేలా చేసింది.
కమర్శియల్ గానూ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. 60 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. జోయా అక్తర్ మేకింగ్ అంతే రియలిస్టిక్ గా అనిపిస్తుంది. తాజాగా ఈ సినిమాకి కొనసాగింపుగా `గల్లీబోయ్ -2` కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి రణవీర్ సింగ్ పాత్రలో విక్కీ కౌశల్, అలియాభట్ పాత్రలో అనన్యా పాండేను తీసుకుంటున్నట్లు సమాచారం.
అలాగే ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా మారారు. `ఖో గయే హమ్ కహాన్` ఫేమ్ అర్జున్ వరైన్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి విక్కీ, అనన్యా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. లుక్ టెస్ట్ లోనూ ఇద్దరు పర్పెక్ట్ గా సూటయినట్లు తెలుస్తోంది. విక్కీ, అనన్య ఇంత వరకూ ఇలాంటి జానర్ ను టచ్ చేసింది లేదు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉంది. ఆ పనులు త్వరలోనే పూర్తవుతాయని సమాచారం. అలాగే విక్కీ, అనన్య కూడా వివిధ ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు సహా నాయికా,నాయకుల షెడ్యూల్ ని బట్టి ప్రాజెక్ట్ ని పట్టా లెక్కించనున్నారు. బాలీవుడ్ లో హిట్ సినిమాలకు సీక్వెల్స్ అన్నది సర్వసాధరణం. అలాంటి విజయాలు అందుకోవడం కూడా వాళ్లకే చెల్లింది. దీంతో సీక్వెల్స్ అన్నది అక్కడో సెంటిమెంట్ గానూ మారిపోయింది.