Begin typing your search above and press return to search.

కొత్త సినిమా వల్ల పాత ఫ్లాప్‌ మూవీ రీ రిలీజ్‌ డిమాండ్‌

ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   5 March 2024 3:45 AM GMT
కొత్త సినిమా వల్ల పాత ఫ్లాప్‌ మూవీ రీ రిలీజ్‌ డిమాండ్‌
X

ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా ను త్వరలో తెలుగు లో డబ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

తమిళ ప్రేక్షకులు ఇప్పటికే మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమాను తెగ చూసేస్తున్నారట. ఈ సినిమాను కమల్‌ హాసన్‌ సినిమా గుణ చిత్రీకరణ జరిపిన గుహ నేపథ్యంలో రూపొందించడం జరిగింది. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే పాట చిత్రీకరించిన గుహ లో మంజుమ్మెల్‌ బాయ్స్ కథ నడుస్తుంది.

మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమా హిట్‌ అవ్వడంతో అంతా కూడా కమల్‌ హాసన్‌ గుణ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. 1991 లో విడుదలైన కమల్‌ హాసన్ గుణ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే ఆ తర్వాత అందులోని పాటలు మరియు కాన్సెప్ట్‌ ప్రేక్షకులకు బాగా ఎక్కింది.

బుల్లి తెర పై వచ్చిన సమయంలో మంచి టీఆర్‌పీ రావడంతో పాటు యూట్యూబ్‌ లో కూడా ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు గుణ ను కల్ట్‌ మూవీగా రీ రిలీజ్ చేయాలని డిమాండ్‌ వినిపిస్తుంది. తమిళ ప్రేక్షకులు ఇప్పటికే గుణ రీ రిలీజ్ కోసం నిర్మాతను డిమాండ్‌ చేస్తున్నారు.

పాత గుణను ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ లో చాలా మంది చూస్తున్నారు. మంజుమ్మెల్‌ బాయ్స్ చూసిన వారు కచ్చితంగా కమల్‌ గుణ చూడాలని ఆశ పడుతున్నారు. ఇదే సరైన సమయంగా భావించి అప్పుడు నిరాశ పరిచిన గుణ ను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని తమిళ మీడియా వర్గాలు మరియు సినీ వర్గాల వారు భావిస్తున్నారట. అన్ని కుదిరితే ఆ ఫ్లాప్ బొమ్మ తిరిగి వెండి తెరపై పడే అవకాశాలు ఉన్నాయి.