Begin typing your search above and press return to search.

గుణ శేఖ‌ర్ దారెటు? అటా? ఇటా!

స్టార్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్న‌ర దాటింది. 'శాకుంత‌లం' త‌ర్వాత గుణ శేఖ‌ర్ ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 8:30 PM GMT
గుణ శేఖ‌ర్ దారెటు? అటా? ఇటా!
X

స్టార్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్న‌ర దాటింది. 'శాకుంత‌లం' త‌ర్వాత గుణ శేఖ‌ర్ ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. రానా ద‌గ్గుబాటితో ఓ చారిత్రాత్మ క‌థ తీయాల‌నుకున్నారు? గానీ ఎందుక‌నో అది సాద్య‌ప‌డ‌లేదు. ఆ త‌ర్వాత అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో త‌దుప‌రి సినిమా చేస్తారా? ఇదే మౌనాన్ని ఇంకొన్నాళ్లు కొన‌సాగిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

గుణ‌శేఖ‌ర్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు దూర‌మై చాలా కాల‌మ‌వుతోంది. 2012 వ‌రకే క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేసారు. ఆ త‌ర్వాత `రుద్ర‌మ‌దేవి` చిత్రాన్ని భారీ కాన్వాస్ పై తెర‌కెక్కించారు. ఈసినిమా ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే స్పూర్తితో 'శాకుంతలం' చేసారు. ఈ రెండు సినిమాల మ‌ధ్య ఎనిమిదేళ్లు వ్య‌త్యాసం ఉంది. అయితే ఈ రెండు సినిమాల‌తో గుణ‌శేఖ‌ర్ కి పేరు వ‌చ్చింది కానీ లాభాలైతే రాలేదు.

ఈ నేప‌థ్యంలో గుణ‌శేఖ‌ర్ త‌దుప‌రి చిత్రం ఎలాంటిదై ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. క‌మర్శియ‌ల్ పంథాలోకి వ‌స్తారా? మ‌ళ్లీ చ‌రిత్ర బాట ప‌డ‌తారా? అన్న‌ది చూడాలి. గుణ‌శేఖ‌ర్ మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో చేసింది కేవ‌లం 13 సినిమాలే. లాఠీ సినిమాతో డైరెక్ట‌ర్ అయ్యారు. 'చూడాల‌ని ఉంది', 'ఒక్క‌డు', 'అర్జున్' లాంటి హిట్లు ఉన్నాయి. 'సైనికుడు', 'నిప్పు', 'వ‌రుడు' లాంటి చిత్రాలు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ న‌డుస్తోంది. అలాంటి సినిమాలు తీయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. టాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఫాంలో ఉన్న డైరెక్ట‌ర్లు అంద‌రికంటే వినూత్నంగా ఆలోచించింది గుణ‌శేఖ‌రే. అందుకే `బాహుబ‌లి` తో స‌మాంత‌రంగా 'రుద్ర‌మ‌దేవి'ని ప‌ట్టాలెక్కించ‌గలిగారు.