గుణశేఖర్.. ఈసారి ‘యుఫోరియా’
గుణశేఖర్ ప్రస్తుతం యువతను ఆకట్టుకునే సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: Tupaki Desk | 28 May 2024 7:21 AM GMTతెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు గుణశేఖర్. ‘ఒక్కడు’, ‘చూడాలని వుంది’, ‘అర్జున’ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఇటీవల కాలంలో ఆయన కొన్ని సినిమాలతో అపజజయాలు ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్ లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది
గుణశేఖర్ ప్రస్తుతం యువతను ఆకట్టుకునే సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'యుఫోరియా’ పేరుతో రాబోతున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే సామాజిక అంశాలను చర్చించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి అంశం పక్కాగా ప్లాన్ చేసి, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ కష్టపడుతున్నారు.
గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు మరియు సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. గుణశేఖర్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలు కమర్షియల్ భారీ విజయాలు సాధించాయి.
కానీ ఇటీవల, ఆయనకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాలు దక్కలేదు. చివరగా చేసిన శాకుంతలం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ ఆయన మళ్ళీ సరికొత్త కథనంతో సిద్ధమవుతున్నారు ఈ నేపధ్యంలో, ‘‘యుఫోరియా’’ చిత్రం గుణశేఖర్‌కు తప్పనిసరిగా హిట్ ఇవ్వాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక చిత్రంతో మంచి ప్రశంసలు పొందిన గుణశేఖర్, ఇప్పుడు సరికొత్త కథాంశంతో యువతను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సమకాలీన సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ, యువతను ఆకట్టుకునేలా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. యుఫోరియా సినిమా కథ, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉంటుందట.
సాంకేతికంగా మరియు కథాపరంగా కొత్తదనం, వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని గుణశేఖర్ భావిస్తున్నారు. గుణశేఖర్ కెరీర్‌లో ఇది ఒక కీలకమైన మలుపుగా ఉండనుంది. ఆయనకు ఈ సినిమాతో మంచి విజయం అందడం ముఖ్యం. నిర్మాతగా కూడా ఆయన సొంతంగా రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి