Begin typing your search above and press return to search.

గన్స్ అండ్ గులాబ్స్.. ఎలా ఉందంటే?

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Aug 2023 4:42 AM GMT
గన్స్ అండ్ గులాబ్స్.. ఎలా ఉందంటే?
X

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటికి ఫుల్ డిమాండ్ ఉండటంతో నిర్మాతలు కూడా కోట్లు వెచ్చించి వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి ఫ్యాన్సీ రేటుకి అమ్ముకుంటున్నారు. కొన్ని వెబ్ సిరీస్ లని డైరెక్ట్ గా డిజిటల్ ఛానల్స్ సొంతంగా నిర్మిస్తున్నారు.

ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న రాజ్ అండ్ డీకే ద్వయం తర్వాత ఫర్జీ వెబ్ సిరీస్ తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. తాజాగా గన్స్ అండ్ గులాబ్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాలీవుడ్ లో పాత సినిమాల ఇన్సిపిరేషన్ తో అదే స్టైల్ లో క్యారెక్టరైజేషన్స్, బ్యాక్ డ్రాప్ తో ఈ వెబ్ సిరీస్ ని 90లో జరిగే స్టోరీగా చూపించారు.

క్రైమ్, కామెడీతో ఈ వెబ్ సిరీస్ ని ఆవిష్కరించారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు మరో ఇంటరెస్టింగ్ రోల్ చేశారు. గులాబీ గంజ్ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. గ్రామంలో ఉండే టిప్పు రెండు హత్యలు చేసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అదే ఊరికి అర్జున్ వర్మ పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు.

గ్రామంలో లోకల్ డాన్ కొడుకులు తండ్రి వారసత్వం కోసం పోటీ పడుతూ ఉంటారు. నల్లమందు అక్రమ రవాణతో స్టోరీ లింక్ అయ్యి నడుస్తుంది. క్రైమ్, కామెడీగా చేయాలని రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ కథని సిద్ధం చేసుకున్నా కంటెంట్ లో ఎక్కడా స్పీడ్ లేదు. చాలా స్లో నేరేషన్ తో అవసరం లేని సీక్వెన్స్ తో మొదటి మూడు ఎపిసోడ్స్ నడుస్తాయి.

తరువాత కూడా కంటెంట్ లో ప్రేక్షకులకి థ్రిల్ అనిపించే అంశాలు ఏవీ పెద్దగా లేవని చెప్పాలి. ది ఫ్యామిలీ మెన్ సిరీస్, ఫర్జీ లని దృష్టిలో పెట్టుకొని గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం అంతగా ఆసక్తి కలిగించలేదని చెప్పాలి. అయితే ఇంట్లో తీరిగ్గా చూసుకునే అవకాశం ఉంది కాబట్టి టైం దొరికినప్పుడల్లా ఎపిసోడ్ వారీగా చూసుకోవచ్చు.