Begin typing your search above and press return to search.

మహేష్ బర్త్ డే.. ఈ కారం పరిస్థితేంటో..

ఎందుకంటే మహేష్ ఇంతవరకు తన ప్రతి పుట్టినరోజు కూడా ఏదో ఒక అప్డేట్ తో అయితే మంచి కిక్ అయితే ఇచ్చాడు

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:44 AM GMT
మహేష్ బర్త్ డే.. ఈ కారం పరిస్థితేంటో..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా ఇంకా ఒక ట్రాక్లోకి రాలేదు అని అనిపిస్తుంది. ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 9వ తేదీ కోసమైతే ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ పుట్టినరోజు అయితే అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. అయితే తప్పకుండా ఆరోజు ఏదో ఒక అప్డేట్ ఉంటుంది అని ఫ్యాన్స్ ఆశలు కూడా పెంచేసుకుంటున్నారు.

ఎందుకంటే మహేష్ ఇంతవరకు తన ప్రతి పుట్టినరోజు కూడా ఏదో ఒక అప్డేట్ తో అయితే మంచి కిక్ అయితే ఇచ్చాడు. సినిమాలు రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ రోజు మహేష్ నుంచి వచ్చే అప్డేట్స్ మాత్రం ఫ్యాన్స్ కు చాలా మంచి అనుభూతిని అయితే కలిగిస్తాయి. అయితే ఈసారి గుంటూరు కారం విషయంలో మాత్రం ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది.

అసలైతే మొదట థమన్ సూపర్ స్టార్ పుట్టినరోజు కానుకగా ఒక మంచి ట్యూన్ ఇవ్వాలని అనుకున్నాడు. పలు రకాల ట్యూన్స్ విన్న త్రివిక్రమ్ ఒకదాన్ని ఫైనల్ చేశాడు. అయితే ఇంకా అది మహేష్ బాబుకు వినిపించారా లేదా అనే విషయంలో మాత్రం అసలు క్లారిటీ లేదు. మరోవైపు మహేష్ బాబు థమన్ నుంచి ఇంకా అంతకుమించి అనేలా కోరుకుంటున్నాడు అని, ప్రిన్స్ కు ట్యూన్ నచ్చలేదు అని కూడా గాసిప్స్ అయితే వస్తున్నాయి.

ఒకవేళ ఆ సాంగ్ ఫైనల్ కాకపోతే నిర్మాతలు హ్యాపీ బర్త్ డే పోస్టర్ తో సరిపెట్టేలా ఉన్నారు అని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. సాధారణంగా ఒక పోస్టర్ వదిలితే మాత్రం బర్త్ డే రోజు ఫ్యాన్స్ మరింత అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని, ఏమీ రిలీజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఒకటి అప్డేట్ ఇస్తే సరిపోతుంది అనే తరహాలో మాత్రం పోస్టర్ వదిలితే చాలా దారుణంగా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

కానీ ఏదో ఒక అప్డేట్ ఇవ్వకుండా అయితే చిత్ర యూనిట్ ఉండదు. కాబట్టి మహేష్ కు నచ్చే విధంగా ఏదో క్రేజీగా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. సినిమాపై తప్పనిసరిగా ఈ అప్డేట్ ఎంతో కొంత హైట్ అయితే పెంచాలి. ఎందుకంటే మళ్లీ సినిమా విడుదల టైం దగ్గర పడే వరకు కూడా అప్డేట్స్ ఇవ్వడానికి కుదరదు. సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడే ఒక అప్డేట్ ఇచ్చి మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ ప్రమోషన్స్ లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తే సరిపోతుంది. మరి త్రివిక్రమ్ టీం అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతుందో లేదో చూడాలి.