Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. మరో గుడ్ న్యూస్!

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రెస్ మీట్ లో గుంటూరు కారం సినిమా సంక్రాతికి విడుదల అవుతుందని స్పష్టం చేశారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:29 AM GMT
గుంటూరు కారం.. మరో గుడ్ న్యూస్!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే ఏడాది క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా కథ మొత్తం మళ్ళీ మార్చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. పూజా హెగ్డేని తొలగించి శ్రీలీలని మెయిన్ లీడ్ గా పెట్టుకున్నారు. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ కి వచ్చింది. అలాగే సినిమాటోగ్రాఫర్ ని కూడా మార్చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పనిపట్ల కూడా మహేష్ సంతృప్తిగా లేరనే ప్రచారం తెరపైకి వచ్చింది. అతన్ని మార్చేయాలనుకుంటున్నారు అంటూ పుకార్లు వినిపించాయి. అయితే వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఫైనల్ గా ఆయన ఇచ్చిన టైటిల్ సాంగ్ ట్రాక్ వర్క్ అవుట్ అయ్యిందనే విషయం బయటకొచ్చింది. దీంతో ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించడం ఖాయం అయినట్లు క్లారిటీ వచ్చింది.

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రెస్ మీట్ లో గుంటూరు కారం సినిమా సంక్రాతికి విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఈ మాటలతో సినిమాపై వచ్చిన అన్ని ఫుకార్లకి ఫుల్ స్టాప్ పడిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారంట. మహేష్ కూడా డేట్స్ కేటాయించడం జరిగిందని సమాచారం.

ఈ మూవీ కోసం తమన్ అందిస్తున్న మ్యూజిక్ ట్రాక్స్ అన్ని కూడా మహేష్ బాబు ఫైనల్ చేసిన తర్వాత త్రివిక్రమ్ కూడా ఖరారు చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం మూవీ నుంచి సెకండ్ సాంగ్ కూడా ఫైనల్ అయ్యిందంట. మెలోడీ సాంగ్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు రెండు సాంగ్స్ మూవీలో ఫైనల్ అయ్యాయి.

మిగిలిన సాంగ్స్ పైన కూడా తమన్ గట్టిగానే ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నారంట. చేతినిండా ప్రాజెక్ట్స్ ఉండటంతో గుంటూరు కారంకి ఆశించిన స్థాయిలో తమన్ మ్యూజిక్ ఇవ్వడం లేదనే సందేహాలు మహేష్ బాబుకి ఉన్నాయి. అయితే తమన్ మాత్రం తన రిజల్ట్ తో సూపర్ స్టార్ ని సంతృప్తి పరిచినట్లు తెలుస్తోంది.