Begin typing your search above and press return to search.

గుంటూరు కారం యాక్షన్ ఘట్టాలు.. గట్టిగానే..

ఇప్పటికే అందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. ప్రస్తుతం ఇంకో ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   9 Sep 2023 4:30 AM GMT
గుంటూరు కారం యాక్షన్ ఘట్టాలు.. గట్టిగానే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గుంటూరు కారం. భారీ బడ్జెట్ తో హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దీనికోసం త్రివిక్రమ్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో కీలక సన్నివేశాలు కంప్లీట్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు కామెడీని కూడా ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కూడా ఫ్యాన్స్ కామెడీ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన ఖలేజా మూవీ ఫ్లాప్ అయిన కూడా అందులో కామెడీని ప్రేక్షకులు ఇప్పటికి ఆశ్వాదిస్తూ ఉంటారు. మరోసారి అలాంటి కామెడీని గుంటూరు కారం నుంచి కోరుకుంటున్నారు.

ఫ్యాన్స్ కోరుకునే అంశాలు అన్ని కూడా గుంటూరు కారంలో పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక మూవీ టైటిల్ కి తగ్గట్లుగా ఘాటెక్కించే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయంట. సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ బలమైన యాక్షన్ సీక్వెన్స్ ని కూడా ఆశిస్తారు. అందుకు తగ్గట్లుగానే గుంటూరు కారం సినిమాలో నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేశారంట.

ఇప్పటికే అందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. ప్రస్తుతం ఇంకో ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత మళ్ళీ టాకీ పార్ట్ కి వెళ్లనున్నారంట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఖర్చు కూడా ఎక్కువగానే పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి సీజన్ సూపర్ స్టార్ కి బాగా కలిసొస్తుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా గుంటూరు కారంతో గట్టిగానే వాడుకోవాలని అనుకుంటున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ లో కనిపించబోతోంది. శ్రీలీలతో మంచి డ్యూయెట్స్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుంటూరుకారం ఫుల్ మీల్స్ లా ఉండబోతోందని టాక్.