Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. మళ్లీ అలానేనా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఈ మధ్య కాస్త స్పీడెక్కింది

By:  Tupaki Desk   |   13 Sep 2023 8:45 AM GMT
గుంటూరు కారం.. మళ్లీ అలానేనా?
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఈ మధ్య కాస్త స్పీడెక్కింది. గ్యాప్ లేకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొన్నటి వరకు స్లోగా సాగినప్పటికీ.. చిత్రానికి సంబంధించిన లీక్స్ సోషల్ మీడియాలో దర్శనమవుతూనే ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా మరో లీక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన కొంత షూట్ హైదరాబాద్ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో జరిగిందట. అక్కడ జరిగిన షూట్ కు సంబంధించిన విజువల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అవి కోర్టు సన్నివేశాలకు సంబంధించిన షూట్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలోనూ సోషల్ మెసేజ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది.

ఇక ఇది తెలుసుకుంటున్న అభిమానులు.. సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందిస్తున్నారు. భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ మధ్య మహేశ్ నుంచి వస్తున్న సినిమాలన్నీ సోషల్ మెసేజ్ లు ఎక్కువగా ఉంటున్నాయి. మహర్షి, భరత్ అనే నేను, శ్రీమంతుడు, సర్కారు వారి పాట.. ఇలా అన్ని కమర్షియల్ టచ్ ఇస్తూ సామాజిక అంశాలను చూపిస్తున్నారు. దీంతో మరోసారి మహేశ్ బాబు సినిమాలో సోషల్ మెసేజ్ చూడాలని ఆసక్తి లేదంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఫ్యాన్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఏదో ఒక మంచి విషయాన్ని బాగా చూపించగలిగితే..ఆటోమెటిక్ గా సినీ ప్రియులు, అభిమానులు వాటిని స్వీకరిస్తారు. ఎలాగో త్రివిక్రమ్ తన చిత్రాలను మొదటి నుంచి కమర్షియల్ యాంగిల్ లోనే చూపిస్తూ.. అందులోనే మంచి విలువలున్న సన్నివేశాలను హైలెట్ చేస్తుంటారు. కాబట్టి ఈసారి మహేశ్ బాబుతోనూ అలానే ఉండొచ్చు. కాకపోతే అది ఎలా ఉంటుందో, ఒకవేళ సోషల్ మెసేజ్ ఇస్తే అది ఏమై ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది.

ఫైనల్ గా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తన్నారు. ఎలాగైనా సినిమాను ఈ ఏడాదే పూర్తి చేసి.. చెప్పిన సమయానికి అంటే వచ్చే ఏడాది సంకాంత్రికి విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రిలీజైన మహేశ్ మాస్ లుక్స్ ప్రచార చిత్రాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. చూడాలి మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో...