Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. దిల్ రాజు డీల్ సెట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి అనుకున్న సమయానికి రాబోతుంది అని ఇటీవల నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు

By:  Tupaki Desk   |   3 Oct 2023 10:30 AM GMT
గుంటూరు కారం.. దిల్ రాజు డీల్ సెట్!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతికి అనుకున్న సమయానికి రాబోతుంది అని ఇటీవల నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో మరోసారి వైరల్ అవుతున్న గాసిప్స్ కు ఎండ్ కార్డు పడినట్లు అయింది. ఎందుకంటే రెండు మూడు వారాల నుంచి ఈ సినిమాను కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా చాలా రకాల కామెంట్స్ అయితే వినిపించాయి.

ఇక నిర్మాత నాగ వంశీ అలాంటిదేమీ లేదు అని త్వరలోనే అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి అని వివరణ ఇచ్చారు. దసరా కంటే ముందే ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్ కూడా రాబోతుంది అని వివరణ ఇచ్చారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలావరకు క్లోజ్ అయినట్లుగానే తెలుస్తోంది.

ఇంతకుముందే కొంతమంది బయ్యర్లు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం మరోసారి త్రివిక్రమ్ మహేష్ బాబు మీద నమ్మకంతో నైజాం థియేట్రికల్ రైట్స్ ను భారీ డీల్ కు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా నైజాం ఏరియాలోనే దాదాపు 50 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు గతంలోనే టాక్ వచ్చింది.

నిర్మాతలు కూడా అదే రేంజ్ లో కోట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ దిల్ రాజు కూర్చున్న తర్వాత ఈ లెక్క 42 రెండు కోట్లకు తెగినట్లుగా తెలుస్తోంది. గతంలోనే మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన డీల్స్ ను అందుకున్న దిల్ రాజు మంచి లాభాలను సొంతం చేసుకున్నాడు.

ఇక త్రివిక్రమ్ కు సంబంధించిన దాదాపు అన్ని ప్రాజెక్టులను కూడా దిల్ రాజు నైజం లో బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా గుంటూరు కారం సినిమాపై భారీగానే పెట్టుబడి పెట్టారు. సంక్రాంతికి తప్పకుండా ఈ సినిమా పోటీలో బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటుంది అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక దిల్ రాజు చేతిలో పడింది కాబట్టి థియేటర్లు కూడా గట్టిగానే వస్తాయి. మరి ఈ పోటీలో సినిమా ఎంతవరకు ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.