Begin typing your search above and press return to search.

దివాలీకీ గుంటూరోడి ట్రీట్ షురూనా?

సూపర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో 'గుంటూరు కారం' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 Oct 2023 8:02 AM GMT
దివాలీకీ గుంటూరోడి ట్రీట్ షురూనా?
X

సూపర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో 'గుంటూరు కారం' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ లో మాస్ యాంగిల్ ని బ‌య‌ట‌కు తెస్తూ గురూజీ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మ‌హేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ లో పూన‌కాలు తెప్పిస్తుంది. మాస్ కా బాప్ అనిపించే లుక్ మా హీరో సంక్రాతిని షేక్ చేస్తాడంటూ అభిమానుల్లో ధీమా క‌నిపిస్తుంది. అందుకు త‌గ‌ట్టే గురూజీ ఔట్ ఫుట్ కూడా ఉంటుంద‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. సంక్రాంతికి ఇంకా రెండు నెల‌లు స‌మయం ఉన్న నేప‌థ్యం లో అప్ప‌టికి అన్ని ప‌నులు పూర్తిచేయోచ్చు అన్న ధీమా టీమ్ లో క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. మ‌హేష్ వెకేష‌న్ లో ఉన్నారు. మ‌రోవైపు టీమ్ కొత్త షెడ్యూల్ ప్రారంభించే ప‌నిలో ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ స్పైసీ అప్ డేట్ అందింది.

ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్ర‌త్యేకంగా కొన్ని సెట్లు వేస్తున్నారు. వాటిలో కీక‌ల మైన స‌న్నివేశా ల‌తో పాటు..పాట‌లు చిత్రీక‌రించ‌నున్నారు. దీనిలో భాగంగా 6 రోజుల షూట్ ఒక‌టి అందులో నిర్వ‌హించా ల్సి ఉంది. అది పాట‌కు సంబంధించింద‌ని తెలుస్తోంది. ఇప్పుడా పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ సాంగ్ ని దీపావాళ‌కి కానుక‌గా లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేయాల‌ని టీమ్ భావింస్తోందిట‌.

ఈ పాట‌ని దివాలీ లోపు చిత్రీక‌రించిన‌ట్లు అయితే రిలీజ్ చేయోచ్చు అని భావిస్తున్నారుట‌. ఇదొక మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. మ‌హేష్‌..శ్రీలీల‌పై ఈ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అయితే దివాలీకి కేవ‌లం ప‌ది రోజులే స‌మ‌యం ఉంది. న‌వంబ‌ర్ 10న దీపావ‌ళి అప్ప‌టిలో గా పాట చిత్రీక‌ర‌ణ అనేది పూర్త‌వుతుందా? అన్న‌ది సందేహ‌మే. అలాకానీ ప‌క్షంలో కేవ‌లం లిరిక‌ల్ సాంగ్స్ ని స్టిల్స్ తో రిలీజ్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు. అదే జ‌రిగితే ఈ సినిమా నుంచి వ‌స్తోన్న తొలి సింగిల్ అదే అవుతుంది.

దీపావ‌ళి త‌ర్వాత మేకర్స్ కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారుట‌. అలాగే పాట‌ల‌కు సంబంధించి విదేశాల‌కు వెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. ఎట్టి ప‌రిస్థితుల్లో న‌వంబ‌ర్ చివ‌రిక‌ల్లా షూటింగ్ పూర్తి చేయాలి అన్న‌ది త్రివిక్ర‌మ్ ప్లాన్ అని వినిపిస్తుంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.