Begin typing your search above and press return to search.

గుంటూరు కారం హడావుడిలో.. మరో ట్విస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గుంటూరు కారం

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:11 AM GMT
గుంటూరు కారం హడావుడిలో.. మరో ట్విస్ట్..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పాటలు కంప్లీట్ చేస్తే మేగ్జిమం షూటింగ్ ప్యాకప్ చెప్పేస్తారు. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ లీడ్ లో మీనాక్షి చౌదరి కనిపించబోతోంది. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఫుల్ మాస్ కమర్షియల్ జోనర్ లో త్రివిక్రమ్ గుంటూరు కారం చేస్తున్నాడు.

సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే డిసెంబర్ నెల వచ్చిన ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. సాంగ్ షూటింగ్ కేరళలో లైవ్ లోకేషన్స్ లో చేయాలని ముందుగా అనుకున్నారంట. అయితే అక్కడి వాతావరణం ప్రస్తుతం బాగోలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సాంగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉండటంతో వీలైనంత వేగంగా పూర్తి చేయడంపై త్రివిక్రమ్ దృష్టి పెట్టారంట. కరెక్ట్ గా చూసుకుంటే రిలీజ్ కి నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 30 రోజుల్లో అవుట్ పుట్ రెడీ చేసి రిలీజ్ కాపీ రెడీ చేయాలి.

మధ్యలో మూవీ ప్రమోషన్స్ కూడా యాక్టివ్ గా ఉండాలి. అలా చేయగలిగితేనే సినిమా చెప్పిన టైంకి రిలీజ్ చేయగలరు. లేదంటే హడావిడిగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ గాని, త్రివిక్రమ్ గాని తమ సినిమాల రిలీజ్ విషయంలో పక్కా ప్లానింగ్ తోనే ఉంటారు. కాని గుంటూరు కారం విషయంలో మాత్రం అలా జరగడం లేదు.

వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో త్రివిక్రమ్ జోరు మీద ఉన్నారు. దీంతో హ్యాట్రిక్ ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా శ్రీమంతుడు తర్వాత కెరియర్ లో మేగ్జిమం సూపర్ హిట్ సినిమాలే అందించారు. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అవుతుందా లేదంటే గత చిత్రాల ఫలితాన్నే ఇస్తుందా అనేది చూడాలి.