Begin typing your search above and press return to search.

ఆ ఒక్క మాటతో సూపర్ స్టార్‌ ఫ్యాన్స్‌ కూల్‌...!

గతంలో మహేష్ బాబు కి యువరాజు సినిమాలో కొడుకు పాత్రలో తేజ కనిపించాడు

By:  Tupaki Desk   |   2 Jan 2024 9:05 AM GMT
ఆ ఒక్క మాటతో సూపర్ స్టార్‌ ఫ్యాన్స్‌ కూల్‌...!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఇతర సంక్రాంతి సినిమాలు సైడ్‌ అవ్వాలిసిందే అన్నట్లుగా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో గుంటూరు కారంకు పోటీ అన్నట్లుగా అదే రోజు తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రూపొందిన హనుమాన్ విడుదల అవుతున్న విషయం తెల్సిందే. చిన్న సినిమా అయినా కూడా చేసిన ప్రచారంతో హనుమాన్ కి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు.

గుంటూరు కారం సినిమాకు పోటీ లేకుండా చేసేందుకు, హనుమాన్ ను వాయిదా వేయించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ హనుమాన్ మేకర్స్‌ తగ్గేదే లేదు అన్నట్లుగా చాలా ధీమాతో వస్తున్నారు. దాంతో ఇండస్ట్రీలో చాలా మంది మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ హనుమాన్‌ యూనిట్‌ సభ్యులపై కోపంగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో హనుమాన్‌ హీరో తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు ఫ్యాన్స్ ను కాస్త శాంత పరిచే విధంగా ఉన్నాయి అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మహేష్ బాబు కి యువరాజు సినిమాలో కొడుకు పాత్రలో తేజ కనిపించాడు. ఇప్పుడు ఆ మహేష్ బాబు సినిమాకు పోటీగా వస్తావా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తేజ మాత్రం మహేష్ సర్‌ సినిమాకు మా సినిమా ఎలాంటి పోటీ కానే కాదు. అయినా మేము మహేష్ సర్‌ సినిమాకి పోటీగా రావడం లేదు, మహేష్ సార్‌ తో కలిసి వస్తున్నాం అన్నాడు.

మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలకు కాస్త కూల్‌ అయినట్లుగా అనిపిస్తుంది. గర్వం లేకుండా చాలా సౌమ్యం గా తేజ చేసిన ఈ కామెంట్స్ తో హనుమాన్‌ సినిమాకు మహేష్ బాబు ట్రోల్స్ కాస్త తగ్గినట్లే అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ రోజు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది చూడాలి.