Begin typing your search above and press return to search.

గుంటూరు కారం యూఎస్ టార్గెట్‌ ఎంతో తెలుసా...?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రికార్డులు ఉన్నాయి

By:  Tupaki Desk   |   5 Jan 2024 7:33 AM GMT
గుంటూరు కారం యూఎస్ టార్గెట్‌ ఎంతో తెలుసా...?
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రికార్డులు ఉన్నాయి. అత్యధిక మిలియన్‌ డాలర్ల సినిమాలను కలిగి ఉన్న టాలీవుడ్‌ హీరోగా మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు.

మహేష్ బాబు నటించిన ప్రతి సినిమా హిట్‌, ఫ్లాప్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కటి కూడా అక్కడ మిలియన్ డాలర్లను వసూళ్లు చేయడం పరిపాటిగా మారింది. అందుకే మహేష్‌ బాబు సినిమా యొక్క యూఎస్ డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్ హాట్‌ కేక్‌ అంటూ ఉంటారు.

ఒకప్పుడు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయడం గొప్ప విషయంగా చెప్పబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ హద్దు చెరిగింది. మిలియన్ డాలర్ల సినిమాను ఒక సాధారణ సినిమాగానే భావించాల్సి ఉంటుంది. రెండున్నర నుంచి మూడున్నర మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధిస్తే తప్ప అక్కడ హిట్‌ అయినట్లుగా పరిగణించడం లేదు.

గుంటూరు కారం సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించే టార్గెట్‌ తో విడుదల అవ్వబోతుంది. మేకర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ గత చిత్రాల ఫలితాలు మరియు యూఎస్ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్ల నేపథ్యం లో గుంటూరు కారం అక్కడ 5 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేయడం పెద్ద కష్టం ఏమీ కాదని అంటున్నారు.

చాలా కాలం తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో మూవీ రావడం, ఈ సినిమాలో శ్రీలీల నటించడం వంటి కారణాల వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.