Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ లో రమణగాడి ట్రెండు

సినిమాలో త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపించలేదని చెప్పిన ఆడియెన్స్.. మహేశ్ బాబు పెర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందని తెలిపారు

By:  Tupaki Desk   |   11 Feb 2024 8:35 AM GMT
నెట్ ఫ్లిక్స్ లో రమణగాడి ట్రెండు
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ లో ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌ లో వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ అందుకుంది.


సినిమాలో త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపించలేదని చెప్పిన ఆడియెన్స్.. మహేశ్ బాబు పెర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందని తెలిపారు. ముఖ్యంగా మహేశ్ డ్యాన్స్ ఇరగదీశారని, విశ్వరూపం చూపించారని ప్రశంసలు కురిపించారు. టాక్‌ తో సంబంధం లేకుండా మహేశ్ మేనియాతో ఈ మూవీకి కలెక్షన్స్ రూ.250 కోట్లకుపైగా వచ్చాయి. అయితే నెలరోజుల్లోనే గుంటూరు కారం మూవీనీ ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్.

గుంటూరు కారం ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా అరుదైన మైలురాయిని సాధించింది. నెట్ ఫ్లిక్స్ లో టాప్-1లో ట్రెండింగ్ అవుతోంది. సొర కత్తి లాంటి రెస్పాన్స్ అంటూ చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేసింది. రమణగాడి మాస్ మ్యాడ్‌ నెస్ గుంటూరు కారం మూవీని నెం.1 స్థానానికి తీసుకెళ్లిందని ట్వీట్ చేసింది.

థియేటర్లలో రమణగాడి మాస్ మ్యానియా ఎంజాయ్ చేసిన సినీ ప్రియులు.. మరోసారి ఓటీటీలో ఈ సినిమాను చూస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హిట్ 2 బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. నటి పూర్ణ స్పెషల్‌ సాంగ్‌ లో అట్రాక్ట్ చేశారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.

మరోవైపు, ఈ చిత్రం తర్వాత మహేశ్.. దర్శకధీరుడు రాజమౌళితో మూవీ చేయనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ లా ఉంటుందని రాజమౌళి చెప్పారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ తెలిపారు. కొన్ని రోజుల క్రితమే మహేశ్ కూడా జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకుని వచ్చారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలిసింది.