Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. ఇక బ్రేక్ వేయడానికి ఛాన్స్ లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా చాలాకాలంగా సెట్స్ పైనే ఉంది

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:43 PM GMT
గుంటూరు కారం.. ఇక బ్రేక్ వేయడానికి ఛాన్స్ లేదు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా చాలాకాలంగా సెట్స్ పైనే ఉంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు జరుపుకుని షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మళ్లీ క్యాన్సిల్ చేసుకుని రకరకాల ఇబ్బందులతో ఈ సినిమా ముందుకు సాగుతోంది. అంతేకాకుండా క్యారెక్టర్స్ టెక్నీషియన్స్ విషయంలో కూడా మార్పులు జరిగిన విషయం తెలిసిందే.

ఇంత పెద్ద స్టార్ హీరో సినిమాలో, అందులోనూ అల.. వైకుంఠపురములో.. లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు ఇలాంటి అనుభవాలను ఎదుర్కోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సినిమా మొత్తానికి సరైన ట్రాక్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడక్కడ కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ అయినప్పటికీ కూడా త్రివిక్రమ్ మేనేజ్ చేసి షూటింగ్ లో వేగాన్ని పెంచుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే కేవలం 35 శాతం మాత్రమే పూర్తయింది. ఇంకా 65 శాతానికి పైగా పూర్తి చేయాలి. నిర్మాతల ప్లాన్ ప్రకారం అయితే సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలి అని చాలా బలంగా అయితే ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ సంక్రాంతికి అనుకున్న డేట్ ప్రకారం కేవలం 140 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

గుంటూరు కారం షూటింగ్ పూర్తి అవ్వాలి అంటే ఇంకా 80 రోజులు అవసరం ఉంది. ఇక షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు అలాగే ప్రమోషన్స్ కు మరికొంత సమయం అవసరం పడుతుంది. కాబట్టి 140 రోజుల్లో సరిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ బ్రేక్ అయితే పడకూడదు. ఒక విధంగా చెప్పాలి అంటే సెలవులు లేకుండా నాన్ స్టాప్ గా వర్క్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది.

అసలైతే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా 2021 నుంచి కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక 20 రోజులు మాత్రమే సినిమాకు కావాల్సిమ అసలైన షూటింగ్ వర్క్ జరిగింది. మరి మిగిలిన షూటింగ్ను అనుకున్న సమయానికి పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీస్తారో లేదో చూడాలి. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ పై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.