Begin typing your search above and press return to search.

గుంటూరు కారం 3 రోజుల కలెక్షన్స్.. టోటల్ లెక్క ఇది

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన మూడవ సినిమా గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jan 2024 7:36 AM GMT
గుంటూరు కారం 3 రోజుల కలెక్షన్స్.. టోటల్ లెక్క ఇది
X

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన మూడవ సినిమా గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కాస్త నెంబర్లు తగ్గినప్పటికీ కూడా మరుసటి రోజు మళ్ళీ ఈ సినిమా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని మాస్ ఏరియాలలో కూడా సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కనిపిస్తూ ఉండడం విశేషం. ఎందుకంటే మహేష్ బాబు క్యారెక్టర్ మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు బాగానే నచ్చింది.

త్రివిక్రమ్ ప్రతిసారి మహేష్ బాబును సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. అతడు ఖలేజా క్యారెక్టర్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు లోని సరికొత్త నటుడిని బయటకు తీయడంలో త్రివిక్రమ్ మ్యాజిక్ మాత్రం మిస్ అవ్వలేదు అనేలా ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద మూడవరోజు కూడా మంచిది కలెక్షన్స్ అందుకుంది.

ఇక ఈ సినిమా షేర్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే ముఖ్యంగా.. నైజాం ఏరియాలోనే మహేష్ బాబు సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం బాక్స్ ఆఫీస్ షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి

నైజాం 28.42 కోట్లు

సీడెడ్ 7.11 కోట్లు

ఉత్తరాంధ్ర 6.4 కోట్లు

గుంటూరు 6.87 కోట్లు

ఈస్ట్ 5.69 కోట్లు

కృష్ణ 4.03 కోట్లు

వెస్ట్ 3.75 కోట్లు

నెల్లూరు 2.30 కోట్లు

ఏపీ తెలంగాణ షేర్: 64.57 కోట్లు

మహేష్ బాబు తెలుగులోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలలో గుంటూరు కారం కూడా ఒకటిగా నిలిచింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ అయితే అందుతూ ఉన్నాయి. ఇక చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం గ్రాస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏపీ తెలంగాణ టోటల్ గ్రాస్: 108 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 23 కోట్లు

ఓవర్సీస్: 33 కోట్లు

వరల్డ్ వైడ్: 164 కోట్లు