Begin typing your search above and press return to search.

థ్యాంక్​ గాడ్​.. 'గుంటూరు కారం' మళ్లీ ఘాటెక్కబోతోంది

ఈ నెల 16న మహేశ్​ భారత్​కు తిరిగి రానున్నారని తెలిసింది. 20వ తేదీ నుంచి మళ్లీ షూట్​లో పాల్గొననున్నారని సమాచారం అందింది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 11:52 AM GMT
థ్యాంక్​ గాడ్​.. గుంటూరు కారం మళ్లీ ఘాటెక్కబోతోంది
X

ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఇటీవలే ఆగిపోయిన సూపర్ స్టార్ మహేశ్​ బాబు 'గుంటూరు కారం' షూటింగ్​ మళ్లీ మొదలుకానుంది. ఎట్టకేలకు మరో కొత్త షెడ్యూల్​ను ప్రారంభించుకోనుందని తెలిసింది. ఫారెన్ టూర్​ వెళ్లిన మహేశ్​ బాబు తిరిగి వచ్చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.

గుంటూరు కారం సినిమా ప్రకటించిన రోజు నుంచి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్​-మహేశ్ కాంబోలో రానుండటం వల్ల సినిమాపై మంచి బజ్ నెలకొంది. కేవలం డిజిటల్ రైట్స్​నే రూ. 80 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసిందని ప్రచారం సాగింది. అలా పాజిటివ్ ఎనర్జీతో ఎంట్రీ అయినా ఈ సినిమాకు మొదని నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.

కథలో మార్పులు, నటీనటులు సెట్​కాకపోవడం, టెక్నిషియన్స్​లో మార్పులు.. ఇలా ఏదో ఒక సమస్యతో షూటింగ్ పోస్ట్ పోన్ కావడం మహేశ్​ బాబు ఫారెన్​ టూర్ వెళ్లిపోవడం జరుగుతూ వస్తుంది. దీనికి తోడు దర్శకుడు త్రివిక్రమ్​.. ఇతర చిత్రాలకు పని చేయడం మహేశ్​ అభిమానుల్లో మరింత అసహనాన్ని పెంచింది. ఆయనపై ఫ్యాన్స్​ ఫుల్​ గుస్సా అవుతున్నారు.

రీసెంట్​గా కూడా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా తప్పుకున్నారనే ప్రచారం బాగా సాగింది. ఆయన స్థానంలో రవి కె చంద్రన్ పేరు కూడా వినిపించింది. ఈ క్రమంలోనే రీసెంట్​గా షూటింగ్ కూడా ఆగిపోయింది. మహేశ్​ బాబు ఫ్యామిలీతో కలిసి దుబాయ్​ టూర్ కూడా వెళ్లిపోయారు. దీంతో అభిమానులు అసలు ఈ సినిమా పూర్తవుతుందా అంటూ అడగడం ప్రారంభించేశారు.

అయితే ఇప్పుడీ సినిమాకు ఎట్టకేలకు మళ్లీ చిత్రీకరణను ప్రారంభించుకోనుందని తెలిసింది. ఈ నెల 16న మహేశ్​ భారత్​కు తిరిగి రానున్నారని తెలిసింది. 20వ తేదీ నుంచి మళ్లీ షూట్​లో పాల్గొననున్నారని సమాచారం అందింది. ఈలోగా కొత్త సినిమాటోగ్రాఫర్​ను ఫైనల్ చేసి షూట్ స్టార్ట్​ చేస్తారట. 11 లేదా 12 నుంచి హీరో లేని ఎపిసోడ్​లను తీయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ నెలలో మహేశ్ పుట్టినరోజు ఉండడంతో సినిమాలోని ఫస్ట్ సాంగ్​ను కూడా రిలీజ్​ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..