గుంటూరు కారం.. అంత తేలిగ్గా కనిపిస్తుందా?
అయితే గుంటూరు కారం మాత్రం ముందుగానే వీలైనంత ఎక్కువ స్థాయిలో ప్రమోషన్స్ చేసుకోవాలి.
By: Tupaki Desk | 4 Oct 2023 7:13 AM GMT2024 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ కనిపించబోతోంది. మహేష్ బాబు అందరికంటే ముందుగానే గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి ఫెస్టివల్ ను టార్గెట్ చేశాడు. మిగతా కొన్ని పెద్ద సినిమాలు ఆ సమయానికి రావాలని అనుకున్నప్పటికీ ప్లానింగ్ లేకపోవడం వలన వాయిదా పడ్డాయి. ముఖ్యంగా ప్రభాస్ కల్కి వెళ్లిపోవడంతో ఇక మిగతా సినిమాలో జోరు చాలా ఎక్కువ అయిపోయింది.
అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ అనగానే అందరూ ఆ ప్రాజెక్టు పైనే ఎక్కువగా ఫోకస్ చూస్తారు అనేది తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న ప్రాజెక్టులు ఏవి కూడా ఈ కాంబినేషన్ పై ఉన్న బజ్ చూసి వెనక్కి తగ్గడం లేదు. థియేటర్స్ ను అసలు ఎలా సర్దుపాట్లు చేస్తారో అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి అంటే రెండు పెద్ద సినిమాలు ఒక మీడియం రేంజ్ సినిమా ఇక మరో చిన్న సినిమా అంటే పరవాలేదు.
కానీ మీడియం రేంజ్ సినిమాలే తాకిడి ఈ సంక్రాంతి ఎక్కువగా ఉండబోతోంది. ఇక నాగార్జున అయితే తన రెగ్యులర్ సెంటిమెంట్ తో నా సామిరంగా సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈగల్ సినిమా విషయంలో కూడా తేల్చేశారు. దానికి తోడు దిల్ రాజు విజయ్ దేవరకొండ పరుశురాం సినిమాను కూడా అదే సమయానికి ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలు క్లిక్ అయితే బిగ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.
అయితే మరోవైపు హనుమాన్ ప్రాజెక్టుపై కూడా కాస్త అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక వెంకటేష్ బిగ్ బడ్జెట్ మూవీ సైంధవ కూడా అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఇక వీటిలో ఏదో ఒక రెండు మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం వెనక్కి తగ్గితే గాని సంక్రాంతి కన్ఫ్యూజన్లో క్లారిటీ రాదు. ఏదేమైనాప్పటికీ గుంటూరు కారం విషయంలో మిగతా సినిమాలు పెద్దగా భయపడడం లేదు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా మేకింగ్ విషయంలో వివిధ రకాల గాసిప్స్ రావడం, రీ షూట్స్, క్యాస్టింగ్ చేంజ్.. అలాగే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటుంది అని గాసిప్స్ బజ్ పోగొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఏమాత్రం గుంటూరు కారం సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన తమకు ఉపయోగపడుతుంది అనేలా కూడా మిగతా సినిమా వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది.
అయితే గుంటూరు కారం మాత్రం ముందుగానే వీలైనంత ఎక్కువ స్థాయిలో ప్రమోషన్స్ చేసుకోవాలి. సినిమాను నవంబర్ నాటికి ఫినిష్ చేసుకుని డిసెంబర్లోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. ఇక అందులో సగం బాధ్యత తమన్ పైనే ఉంది. మరి గుంటూరు కారం సంక్రాంతికి మిగతా సినిమాలను భయపెట్టే విధంగా బజ్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.