Begin typing your search above and press return to search.

అమెరికాలో 'గుంటూరు కారం' రికార్డ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'గుంటూరు కారం' ట్రీట్ కోసం అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:28 AM GMT
అమెరికాలో గుంటూరు కారం రికార్డ్
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `గుంటూరు కారం` ట్రీట్ కోసం అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. 2024 సంక్రాంతి కానుక‌గా జనవరి 12న భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. చిత్ర నిర్మాతలు ప్రీ-రిలీజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. . గుంటూరు కారం మహేష్ కెరీర్‌లో అంచనాల పరంగా అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా నిలవబోతోంది.

మ‌హేష్ ని గ‌తంలో భారీ యాక్ష‌న్ స్టార్ గా ఎలివేట్ చేసిన త్రివిక్ర‌మ్ తాజా మాస్ యాక్షన్ చిత్రంలో మ‌రింత ప్ర‌త్యేకంగా చూపిస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ జోడీ మళ్లీ కల‌వ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ దగ్గర పడుతుండటంతో, మేకర్స్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ తో అంత‌కంత‌కు వేడి పెంచుతున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ మెంట్ కి త‌గ్గ‌ట్టే గుంటూరు కారం ప్రీమియ‌ర్ల‌ను అత్యంత భారీగా ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాని జ‌న‌వ‌రి 11న‌ అమెరికాలో రికార్డ్ స్థాయి స్క్రీన్ల‌లో ప్రీమియ‌ర్ చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం తెలిపింది. దాదాపు 5,408 ప్రీమియ‌ర్ షోలు వేస్తున్నామ‌ని, ఒక తెలుగు సినిమాకి ఇది రికార్డ్ బ్రేకింగ్ అని కూడా చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

ట్రైలర్ కోసం ఉత్కంఠ‌:

రెండు సింగిల్స్ తర్వాత, ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు సమయం ఆసన్నమైంది. గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సరిగ్గా ఒక వారం ముందు, అంటే జనవరి 6న గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. ఈ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.

ప్ర‌ధాన హైలైట్స్:

మ‌హేష్ బాబు మాస్ ఫైట్స్ , రీమిక్స్ సర్ప్రైజ్ ల‌తో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో హైలైట్ అని టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకరచయిత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్యూన్‌లను థమన్ ఎస్ స్వరపరిచారు. నవీన్ నూలి, పిఎస్ వినోద్ గుంటూరు కారం చిత్రానికి ఎడిటర్ - సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, సునీల్, బ్రహ్మానందం, రఘు బాబు నటించారు. ఆచంట తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

బ‌రిలో పందెం పుంజులు:

గుంటూరు కారం వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎవర్ ప్రీరిలీజ్ బిజినెస్ పూర్త‌యింద‌ని టాక్ వినిపిస్తోంది. ఒక ప్రాంతీయ చిత్రానికి రికార్డ్ గణాంకాలు న‌మోద‌య్యాయ‌ని చెబుతున్నారు. టీజర్, సాంగ్ ప్రోమోల నుండి మహేష్ బాబు లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ స‌హా చాలా విష‌యాలు అభిమానులను ఉత్తేజపరిచాయి. ట్రైల‌ర్ తో ఇది మ‌రో స్థాయికి చేరుకోనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున - నా సామి రంగ, వెంకటేష్ -సైంధవ్ , ప్ర‌శాంత్ వ‌ర్మ‌- హనుమాన్ ల‌తో గుంటూరు కారం పోటీప‌డ‌నుంది.